Suryapet Extra Marital Affair Murder : తన భార్యతో వివాహేతర సంబంధం నెరపుతున్నాడనే అనుమానంతో.. ఓ యువకుడిని దమ్ము చక్రాలతో తొక్కించి అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఉదంతమిది. ఈ పాశవిక ఘటన తెలంగాణ సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ మండలం లక్కవరంలో బుధవారం వెలుగుచూసింది.
పోలీసులు, మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్కవరం గ్రామానికి చెందిన బాతుక మహేశ్(30).. అదే గ్రామానికి చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్ భార్యతో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. ఈ విషయమై.. వీరిద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి. నాలుగేళ్ల క్రితం పెద్దమనుషులు పంచాయతీ కూడా చేశారు. ఆయినా.. మహేశ్ పద్ధతి మారలేదు.
హత్య జరిగిందిలా..
ఈ క్రమంలో.. మంగళవారం గూబగుట్టకు వెళ్లే దారిలో తన అన్న పొలంలో నాట్లు వేసే పనిలో మహేశ్ సైతం పాల్గొన్నాడు. నాట్లు ముగిసిన తర్వాత.. మహేశ్ ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. అదే సమయంలో పొలాన్ని దమ్ము చేసి ఆ దారిలోనే వస్తున్న సదరు ట్రాక్టర్ డ్రైవర్.. ఒంటరిగా వెళ్తున్న మహేశ్‌ను గమనించాడు. దీంతో.. పాత పగ గుర్తు తెచ్చుకొని.. వేగంగా ట్రాక్టర్‌తో వెళ్లి మహేశ్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు.
దీంతో.. ద్విచక్రవాహనంతో సహా దారి పక్కనున్న పొలం మడిలో పడిపోయాడు మహేశ్. అంతటితో ఆగకుండా.. ట్రాక్టర్‌ను అతనిపై నుంచి తొక్కించడంతో మహేశ్ అక్కడికక్కడే మరణించాడు. అనంతరం.. సదరు ట్రాక్టర్ డ్రైవర్ పారిపోయాడు.
- ఇదీ చదవండి :