ETV Bharat / crime

man murder: పందులు తోలుకెళ్లిన వ్యక్తి రాత్రయినా ఇంటికి రాలేదు.. ఆరా తీస్తే..! - ఆంధ్రప్రదేశ్​ తాజా నేర వార్తలు

murder case: పొద్దున్నే పందులు తొలుకెళ్లిన వ్యక్తి రాత్రయినా ఇంటికి రాలేదు.. ఏమైందా అని కుటుంబ సభ్యులు ఆరా తీస్తూ అతని కోసం వెతుకుతుండగా షాకింగ్​ విషయం తెలిసింది.. అతనికి ఏమైంది.. కుటుంబ సభ్యులకు ఏ తెలిసింది..

man murder in guntur district
ఓ వ్యక్తిని హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
author img

By

Published : Feb 16, 2022, 11:54 AM IST

murder issue: గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గణపవరం శివప్రియనగర్ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పందులు పోషించుకుంటూ జీవిస్తున్న ఆ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసి మురుగు కాలువ పక్కన పడేశారు.

అసలేం జరిగిందంటే...

చిలకలూరిపేట పట్టణం రూత్ డైక్ మెన్ కాలనీకి చెందిన ప్రతాప్ కిల్లయ్య (35) పందులను పోషించుకుంటూ జీవిస్తున్నాడు. మంగళవారం ఉదయం ఇంటి నుంచి వచ్చిన కిల్లయ్య రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకుతూ వెళ్లారు. పందులు ఉంచే ప్రాంతానికి దగ్గరలోనే కిల్లయ్య మృతదేహాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారని చిలకలూరిపేట రూరల్ సీఐ ఎం సుబ్బారావు తెలిపారు. కిల్లయ్య శరీరంపై కత్తిపోట్లు ఉన్నట్లు సీఐ తెలిపారు. హత్య చేసి కొంతదూరం లాక్కొచ్చి మురుగు కాలువ పక్కన పడవేసి ఉండవచ్చునని భావిస్తున్నామన్నారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఇదీ చదవండి:తల్లీకూతుళ్లపై గుర్తుతెలియని వ్యక్తి దాడి.. తల్లి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.