ETV Bharat / crime

Lovers suicide: ప్రియురాలు ఒకచోట.. ప్రియుడు మరో చోట.. ఆత్మహత్య - lovers suicide in mahabubnagar district

తెలంగాణలో ఓ ప్రేమజంట వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా గుండాల్​లో ప్రేయసి సుజాత ఉరివేసుకొని చనిపోగా... మహబూబ్​నగర్ జిల్లా వెన్నచేడులో ప్రియుడు కృష్ణ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.

lovers-committed-suicide-in-vikarabad-and-mahabubnagar-districts
వేర్వేరు ప్రాంతాల్లో ప్రేమజంట ఆత్మహత్య
author img

By

Published : Sep 6, 2021, 11:05 AM IST

తల్లిదండ్రులకు చెప్పే ధైర్యంలేకనో.. చెబితే ఒప్పుకోరనో.. ఎంతో మంది యువత ప్రేమ పేరుతో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ప్రేమించేటప్పుడు చేసిన ధైర్యం.. పెళ్లి అంగీకారానికి పెద్దలతో మాట్లాడేటప్పుడు చేయలేకపోతున్నారు. ఒకవేళ ధైర్యం చేసినా.. తల్లిదండ్రులను ఒప్పించాల్సిందిపోయి.. వారు వద్దనగానే మనస్తాపానికి గురవుతున్నారు. క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

తాజాగా.. ఓ ప్రేమజంట వేర్వేరుగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం గుండాల్​లో యువతి సుజాత ఉరేసుకుని బలవన్మరణం చెందగా.. మహబూబ్​నగర్ జిల్లా గండీడ్ మండలం వెన్నచేడులో యువకుడు కృష్ణ చెరువులో దూకి మరణించాడు.

స్థానికుల వల్ల ఇరు ఘటనల్లో సమాచారం అందుకున్న ఆ ప్రాంతాల పోలీసులు వారు ఆత్మహత్యకు పాల్పడిన చోటుకు వెళ్లారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: HEAVY RAINS: తెలంగాణను కుదిపేస్తున్న వరుణుడు.. నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.