సైన్ బోర్డు హోర్డింగ్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో.. క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన కర్నూలు సమీపంలో చోటు చేసుకుంది. బెంగళూరు నుంచి నాగపూర్‌కు టామోటా లోడ్‌తో వెళ్తున్న లారీ... కర్నూలు సమీపంలోని ఏర్రకత్వ బస్ స్టాప్ వద్ద ఉన్న సైన్ బోర్డు హోర్డింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ క్లీనర్ అనిల్ రామ్ అక్కడిక్కడే ప్రాణాలుకోల్పోయాడు.
డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. డ్రైవర్, క్లీనర్ మహారాష్ట్రకు చెందిన వారుగా ఉలిందకొండ పోలీసులు గుర్తించారు. లారీలో ఇరుక్కుపోయిన క్లీనర్ మృతదేహన్ని నేషనల్ హైవే సిబ్బంది జేసీబీ సహయంతో బయటకు తీశారు. ఈ ప్రమాదంలో లారీ పూర్తిగా దెబ్బతింది. డ్రైవర్ నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: