ETV Bharat / crime

MURDER: పటాన్​చెరు ఓఆర్​ఆర్​పై దారుణం.. సైడ్ ఇవ్వలేదని కొట్టి చంపారు.. - Lorry driver brutally murdered in patancheru

వాహనానికి సైడ్​ ఇవ్వలేదని ఓ లారీ డ్రైవర్​పై ఇద్దరు వ్యక్తులు రాడ్​తో దాడిచేశారు. ఘటనలో తీవ్రంగా గాయపడిన లారీడ్రైవర్​ అక్కడికక్కడే మృతి చెందాడు (lorry driver murder). ఈ ఘటన తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు(patancheru) శివారు ఓఆర్​ఆర్​పై జరిగింది.

lorry driver brutal murder at patancheru orr
సైడ్ ఇవ్వలేదని కొట్టి చంపారు
author img

By

Published : Jun 27, 2021, 8:15 PM IST

తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు(patancheru) ఓఆర్​ఆర్​పై దారుణం జరిగింది. వెనుక వస్తున్న వాహనానికి సైడ్​ ఇవ్వలేదని ఓ లారీ డ్రైవర్​ను కిరాతకంగా కొట్టి చంపారు (lorry driver murder). నిందితులను పోలీసులు రాత్రికి రాత్రే పట్టుకున్నారు.

ఏపీలోని కృష్ణాజిల్లా తాడేపల్లికి చెందిన అనిల్...​ సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం నాగులపల్లిలోని స్టీల్​ కంపెనీ నుంచి లారీలో స్టీల్​లోడుతో బెంగళూరు వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి డీసీఎంలో వచ్చిన ఇద్దరు... లారీని ఓవర్​టేక్​ చేసేందుకు ప్రయత్నించారు. అనంతరం లారీని దాటొచ్చి డీసీఎంను అడ్డంగా నిలిపి లారీ డ్రైవర్​ అనిల్​తో గొడవ పడ్డారు. మాటా మాటా పెరిగి ఇనుప రాడ్​తో అనిల్​పై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు ఘటనాస్థలిలోనే మృతి చెందాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాత్రికి రాత్రే నిందితులను అరెస్టు చేశారు.

ఇదీ చూడండి: Flash: బీచ్​లో నలుగురి గల్లంతు.. ముగ్గురి మృతదేహాలు లభ్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.