ETV Bharat / crime

జూబ్లీహిల్స్‌ సామూహిక అత్యాచారం కేసులో మలుపు!

author img

By

Published : Sep 3, 2022, 9:47 PM IST

Jubilee Hills gang rape case updates : జూబ్లీహిల్స్‌ అత్యాచారం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంటోంది. జువెనైల్‌ కోర్టులో కాకుండా సాధారణ న్యాయస్థానంలో విచారణ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు అనుమతి ఆధారంగా తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు.

Jubilee Hills gang rape case
Jubilee Hills gang rape case

Jubilee Hills gang rape case: సంచలనం సృష్టించిన హైదరాబాద్​ జూబ్లీహిల్స్‌ అత్యాచారం కేసు కీలక మలుపు తిరుగుతోంది. నిందితులను మేజర్లుగా పరిగణిస్తూ జువెనైల్‌ కోర్టులో కాకుండా సాధారణ న్యాయస్థానంలో విచారణ జరిగే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకు సంబంధించి సమగ్ర ఆధారాలతో హైదరాబాద్‌ కమిషనరేట్‌ పోలీసులు ఒకట్రెండు రోజుల్లో న్యాయస్థానంలో మెమో దాఖలు చేయనున్నట్లు తెలిసింది.

ఇప్పటికే నిందితులను మేజర్లుగా పరిగణించాలంటూ జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు అనుమతి ఆధారంగా తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధమయ్యారు. రెగ్యులర్‌ న్యాయస్థానంలో విచారణ జరిగి నిందితులపై నేరం రుజువైతే కఠినశిక్షపడే అవకాశం కనిపిస్తోంది. మే28న జూబ్లీహిల్స్‌లోని అమ్నేషియా అండ్‌ ఇన్‌సోమ్నియా పబ్‌ నుంచి ఒక బాలిక (17)ను తీసుకెళ్లి ఆరుగురు నిందితులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టిన సంగతి తెలిసిందే.

ఈ కేసులో నిందితుల్ని పోలీసులు అరెస్ట్‌ చేయగా.. ఒకరు మినహా అయిదుగురు మైనర్లుగా తేలింది. వారిని జువెనైల్‌ హోంకు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే నిందితులకు బెయిల్‌ లభించింది. అయితే నిందితులది క్రూరమైన చర్యగా భావించి వారికి జువెనైల్‌ కోర్టులో కాకుండా సాధారణ కోర్టులో విచారించేలా చర్యలు తీసుకోవాలని గతంలోనే పోలీసులు జేజేబోర్డును ఆశ్రయించారు. సాధారణంగా 16 ఏళ్లు దాటిన బాలలుగనక క్రూరమైన నేరాలకు పాల్పడితే మేజర్లుగా పరిగణించి సాధారణ న్యాయస్థానంలో విచారణ జరిపించేందుకు ఆస్కారముంది.

ఇవీ చూడండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.