ETV Bharat / crime

Gandhi Hospital Rape case: వీడని చిక్కుముడి.. ఇంకా లభించని బాధితురాలి ఆచూకీ!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్​లోని గాంధీ ఆసుపత్రి ఘటన కేసు చిక్కుముడి వీడటం లేదు. బాధితురాలి సోదరి ఆచూకీ ఇప్పటి వరకూ లభించకపోవడంతో కేసు దర్యాప్తు మరింత జఠిలంగా మారింది. మరోవైపు టాస్క్‌ఫోర్స్ పోలీసులు బుధవారం మరోమారు సీసీ కెమెరాలను క్షుణ్ణంగా పరిశీలించగా.. ఆసుపత్రిలోని పలు ప్రాంతాల్లో బాధితురాలు తిరిగినట్టు దృశ్యాలు కనిపించాయి. ఈ కేసులో అనుమానితులుగా భావిస్తున్న టెక్నీషియన్ ఉమా మహేశ్వర్, సెక్యూరిటీ గార్డ్ పోలీసుల అదుపులోనే ఉన్నారు.

Gandhi Hospital Rape case
Gandhi Hospital Rape case
author img

By

Published : Aug 19, 2021, 10:32 AM IST

సంచలనం రేపిన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్​లోని గాంధీ ఆస్పత్రి ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. మహబూబ్‌నగర్ నుంచి ఈ నెల 5 న మూత్రపిండాల వ్యాధిని నయం చేసుకునేందుకు వచ్చిన ఓ రోగి అతడి భార్య, మరదలు సాయంగా వచ్చిన అంశం ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌కు వెళ్లి కేసుకు సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకున్నారు. అక్కాచెల్లెళ్ళు ఆల్కాహాల్ విత్ డ్రాయల్ సింప్టమ్స్‌తో.. ఉన్నారని గుర్తించారు.

అక్కడి ఆర్ఎంపీ వైద్యులతో మాట్లాడి ఈ విషయాన్ని ధ్రువీకరించుకున్నారు. ఇక బాధితురాలి సోదరి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తూనే ఉన్నాయి. ఈ కేసులో బాధితురాలిని మహిళా పోలీసులు బుధవారం రహస్య ప్రాంతంలో విచారించారు. ఆమె స్టేట్‌మెంట్‌ను మరోసారి రికార్డు చేశారు. మరోవైపు బాధితురాలి సోదరి కోసం ఆసుపత్రి వార్డుల్లో, ఆసుపత్రి వెలుపల సీసీ కెమెరాలను పరిశీలించగా.. ఈ నెల 11వ తేదీ రాత్రి రెండు సీసీ కెమెరాల్లో అక్కాచెల్లెళ్లు కనిపించారు. తర్వాత చెల్లెలు ఒక్కతే ఉన్న దృశ్యాలు కనిపించాయి.

సీసీ కెమెరాల జల్లెడ..

పోలీసులు సేకరించిన సీసీటీవీ దృశ్యాల్లో.. ఈ నెల 11న రాత్రి అక్కా చెల్లెళ్లిద్దరూ గాంధీ ఆసుపత్రి నుంచి బయటకు వచ్చారు. తర్వాత మళ్లీ తిరిగి ఆసుపత్రికి వచ్చినట్టు కనిపించలేదు. గాంధీ ఆసుపత్రికి రెండు వైపులా బయట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. గాంధీ ఆసుపత్రి నుంచి గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, ఇటువైపు పద్మారావునగర్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వరకు సీసీ కెమెరాల ఫూటేజీలను పరిశీలించారు. ఎక్కడా వీరిద్దరి జాడ కనిపించలేదు. తన భార్య, మరదలు కనిపించడం లేదని తెలుసుకున్న రోగి ఈ నెల 12 రాత్రి ఆసుపత్రి వర్గాలకు సమాచారం ఇవ్వకుండా కుమారుడితో కలిసి మహబూబ్‌నగర్‌కు వెళ్లాడు. అక్కడి వెళ్లాక భార్య, మరదలు కనిపించకపోయినా పోలీసులకు చెప్పలేదు. వీరిద్దరి విషయం అతడికి తెలిసిందా ? లేదా ? అన్న అంశంపై పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు.

ఆ కోణంలోనూ దర్యాప్తు..

గాంధీ ఆసుపత్రికి వచ్చిన అక్కచెల్లెళ్లిద్దరికీ కల్లు తాగే అలవాటుందని వారి బంధువులు, కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. నగరంలో కల్లు ఎక్కడ దొరుకుతుందో తెలియకపోవడానికితోడు.. అప్పటికే ఐదురోజుల పాటు కల్లు తాగకపోవడంతో మద్యం ఉపసంహరణ లక్షణాలతో వారికి మతిస్థిమితం తప్పిఉండొచ్చని వైద్యులు భావిస్తున్నారు. దీంతో వారు సవ్యంగా ప్రవర్తించి ఉండకపోవచ్చంటూ పోలీసులకు తెలపడంతో.. ఆ కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

ఇవీ చూడండి:

Rape: అత్యాచారం జరిగిందంటూ పోలీసులకు యువతి ఫిర్యాదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.