ETV Bharat / crime

Inter Student Suicide : తక్కువ మార్కులొచ్చాయని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

Inter Student Suicide : తాత్కాలిక సమస్యకు ఆత్మహత్యే శాశ్వత పరిష్కారమనుకుని ఎంతో మంది బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. వీరిలో ఎక్కువగా యువత, విద్యార్థులే ఉంటున్నారు. తల్లిదండ్రులు తిట్టారనో.. తక్కువ మార్కులొచ్చాయనో.. ఉద్యోగం రాలేదనో.. ప్రియురాలు మోసం చేసిందనో.. ఇలా కారణమేదైనా చిన్న సమస్యకు ప్రాణాలు తీసుకుంటున్నారు.

Suicide
Suicide
author img

By

Published : Dec 17, 2021, 12:40 PM IST

Inter First Year Student Suicide : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. గతేడాది కంటే ఈ సంవత్సరం ఉత్తీర్ణత తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో తక్కువ మార్కులొచ్చిన విద్యార్థులు కుంగిపోతున్నారు. తక్కువ మార్కులొచ్చాయని బాధలో ఉన్న పిల్లలకు ధైర్యం చెప్పాల్సిందిపోయి కొందరు తల్లిదండ్రులు వారిని మందలిస్తున్నారు. అది తట్టుకోలేని కొంతమంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి ఘటనే నల్గొండలో చోటుచేసుకుంది.

మార్కులు తక్కువొచ్చాయని..

Nalgonda Student Suicide : నల్గొండ గాంధీనగర్​కు చెందిన జాహ్నవి(16) ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతోంది. గతేడాది కరోనా వల్ల నిలిచిపోయిన ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఇటీవలే నిర్వహించగా.. వాటి ఫలితాలు గురువారం వెల్లడయ్యాయి. ఈ పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని జాహ్నవిని ఆమె తల్లిదండ్రులు మందలించారు. ఓవైపు పరీక్షల నిర్వహణలో ఏర్పడిన గందరగోళం.. మరోవైపు ఆన్​లైన్ తరగతుల అయోమయంతో ఎంతో కష్టపడి చదివిన తనకు తక్కువ మార్కులొచ్చాయని బాధపడుతున్న జాహ్నవిని తల్లిదండ్రులు మందలించడంతో మనస్తాపానికి గురైంది. క్షణికావేశానికి లోనై.. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది.

అలా చేస్తావనుకోలేదమ్మా..

Inter Student Suicide Today : ఈ విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు ఘటనాస్థలానికి వెళ్లారు. తమ కళ్లముందు తిరిగిన కుమార్తె ముక్కలవ్వడం చూసి గుండెలవిసేలా రోదించారు. కాస్త మందలిస్తే ఇంకా బాగా చదువుతావనుకుని అన్నామమ్మా.. ఇలా ప్రాణాలు తీసుకుంటావనుకోలేదంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. వారి రోదనలు చూసిన స్థానికులు కంటతడి పెట్టారు.

పిల్లల్ని ఏం అనకండి..

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నచిన్న కారణాలతో ఇలా ప్రాణాలు తీసుకోవద్దని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులకు మంచి భవిష్యత్ ఉందని.. మార్కులు మాత్రమే వారి భవిష్యత్​ను ముందుకు నడపవని చెప్పారు. తల్లిదండ్రులు కూడా పిల్లలకు తక్కువ మార్కులొస్తే మందలించకుండా వారిని వెన్నుతట్టి ప్రోత్సహించాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.