ETV Bharat / crime

ఏమైంది ఈ తల్లిదండ్రులకు.. కన్నపిల్లల్నే ఎందుకు చంపుకుంటున్నారు..! - ఏపీ నేర వార్తలు

Parents Killing their Children: కన్న తల్లిదండ్రులే పిల్లల్ని చంపిన రెండు ఘటనలు వెర్వేరు చోట్ల వెలుగుచూశాయి. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని నాలుగేళ్ల బాలుడిని కన్న తల్లి, ప్రియుడితో కలిసి అంతమొందించగా.. మరో ఘటనలో భార్యపై అనుమానంతో ఏడాదిన్నర వయుసున్న బాలుడిని కడతేర్చాడో తండ్రి.

parents killing their children
పిల్లల్ని చంపుతున్న తల్లిదండ్రులు
author img

By

Published : Dec 30, 2022, 6:12 PM IST

Parents Killing their Children: రాష్ట్రంలో రెండు వేర్వేరు చోట్ల తల్లిదండ్రులే తమ పిల్లల్ని చంపిన ఘటనలు వెలుగుచూశాయి. అభం శుభం తెలియని ఏడాదిన్నర వయసున్న కన్న బిడ్డను గొంతు నులిమి చంపేసాడు ఓ తండ్రి. భార్య మీద అనుమానంతోనే.. తన బిడ్డను చంపినట్టు చెప్పాడు. మరోచోట అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని.. ప్రియుడితో కలసి నాలుగేళ్ల బాలుడిని కడతేర్చింది ఓ కన్న తల్లి.

అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని.. : అక్రమ సంబంధానికి అడ్డువస్తున్నాడని కన్నబిడ్డనే కడతేర్చింది ఓ కన్న తల్లి. వైఎస్సార్ జిల్లా బద్వేల్‌లోని రూపారం పేటలో ఓ మహిళ.. ప్రియుడితో కలిసి నివాసం ఉంటుంది. నాలుగేళ్ల బాలుడు అక్రమ సంబంధానికి అడ్డం ఉంటున్నాడని.. ఎలాగైనా తొలగించుకోవాలని.. ప్రియుడుతో కలిసి పథకం వేసింది. బాలుడిని చంపి అద్దెకు ఉన్న ఇంట్లో బండ కింద పూడ్చి వేశారు. బాలుడు తండ్రి రెండు వారాల నుంచి కుమారుడు కనిపించడం లేదని బద్వేల్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశాడు. బాలుడు హత్యకు గురైనట్టు ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పట్టణంలో చర్చనీయాంశంగా మారింది.

తాజాగా బాలుడి తండ్రి ఫిర్యాదుతో కవిత, ప్రియుడు వినోద్‌ను పోలీసులు విచారించారు. ఇంటి ఆవరణలో పూడ్చిన బాలుడి మృతదేహాన్ని తహశీల్దార్‌ సమక్షంలో అధికారులు వెలికితీసారు. బాలుడి మృతదేహానికి వైద్యులు శవపరీక్ష చేశారు. ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన స్థానికులు నిందితులపై దాడి చేసేందుకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు.

భార్యపై అనుమానంతో.. : అభం శుభం తెలియని ఏడాదిన్నర వయసున్న కన్నబిడ్డను గొంతు నులిమి చంపేశాడో తండ్రి.. పెనుకొండ పోలీసులు గురువారం అతడిని అరెస్ట్ చేశారు. గురువారం సాయంత్రం పెనుకొండలోని సర్కిల్ ఇన్​స్పెక్టర్ కార్యాలయంలో డీఎస్పీ హుస్సేన్ పీరా విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రామగిరికి చెందిన గంగరాజుకు మడకశిర మండలం శివాపురం గ్రామానికి చెందిన కవితతో మూడు సంవత్సరాల క్రితం వివాహమైంది. వివాహమైనప్పటి నుంచి భార్య కవిత మీద అనుమానం పెంచుకొని పదేపదే ఘర్షణకు దిగేవాడు. దీంతో విసిగిపోయిన కవిత.. కుమారుడు పుట్టిన వెంటనే పుట్టింటికి వెళ్లిపోవడం జరిగింది. కుమారుడి చేతికి రెండు వేళ్లు అతుక్కుని ఉన్నాయని.. ఇలా తమ వంశంలో ఎవరికీ లేవని బాలుడు తనకు జన్మించలేదని అనుమానం పెంచుకున్నాడు.

ఈనెల 20వ తేదీన కవిత ఇంటికి చేరుకున్న గంగరాజు.. భార్యతో మంచిగా మాట్లాడి కొడుకు వికాస్​ను ఎత్తుకొని ముద్దాడి మారిపోయినట్లు వారందరికీ నమ్మబలికాడు. కొత్త బట్టలు కొనిస్తానని పెనుకొండ శివారులోని ఉలవల గుట్ట అటవీ ప్రాంతంలో వికాస్ గొంతు పిసికి కర్కశంగా చంపేశాడు. బిడ్డను చంపిన విషయాన్ని గంగరాజు.. తన అన్న రవికి చెప్పడంతో విషయం బయటకు పొక్కింది. నిందితుడు గంగరాజుని ఎన్ఎస్ గేట్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.