ETV Bharat / crime

నకిలీ విద్యా ధ్రువపత్రాలకు అడ్డాగా హైదరాబాద్ - హైదరాబాద్​లో నకిలీ విద్యా ధ్రువపత్రాలు వార్తలు

జిరాక్స్‌ తీసినంత సులభంగా... నకిలీ విద్యా ధ్రువపత్రాల తయారీకి హైదరాబాద్‌ అడ్డాగా మారింది. కొలువుల కోసం యువత అక్రమ బాట పడుతున్నారు. జేఎన్‌టీయూహెచ్‌, ఓయూలలో ప్రతి నెలా ఇలాంటి నకిలీ సర్టిఫికెట్లు పట్టుబడుతునే ఉన్నాయి. అధికంగా విదేశాల్లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన వారే ఉన్నారు.

manufacturing center for forged certificates in Hyderabad
నకిలీ విద్యా ధ్రువపత్రాలకు అడ్డాగా హైదరాబాద్
author img

By

Published : Mar 7, 2021, 10:10 AM IST

నకిలీ విద్యార్హత ధ్రువపత్రాల తయారీకి హైదరాబాద్‌ నగరం అడ్డాగా మారింది. కొందరు మార్కుల శాతాన్ని పెంచుకునేందుకు వక్రమార్గం పడుతుండగా... మరికొందరు పూర్తిగా బోగస్‌ ధ్రువపత్రాలను పొందుతున్నారు. బీటెక్‌, ఎంబీఏ లాంటి ధ్రువపత్రాలను తయారు చేసే ముఠాలు ఒక్కో దానికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నాయి. ఏటా కేవలం జేఎన్‌టీయూహెచ్‌, ఉస్మానియా విశ్వవిద్యాలయాల పరిశీలనలోనే దాదాపు 300 బయటపడుతున్నాయంటే ఈ రాకెట్‌ ఎంతగా వేళ్లూనుకుందో స్పష్టమవుతుంది. ఇతర రాష్ట్రాల వర్సిటీలవి లెక్కేస్తే మరికొన్ని వందలు ఉండొచ్చని అంచనా. ప్రతి సంవత్సరం హైదరాబాద్‌ నగరంలోనే నాలుగైదు ముఠాలు పోలీసులకు పట్టుబడుతుండగా, వారికి దొరకని ముఠాలు పదుల సంఖ్యలోనే ఉంటాయని నిపుణులు భావిస్తున్నారు. జిరాక్స్‌ తీసినంత సులభంగా విశ్వవిద్యాలయాల పట్టాలను ముద్రిస్తున్నారు. ఇది ప్రతి సంవత్సరం కోట్ల రూపాయల వ్యాపారంగా మారిపోయింది.

పాతబస్తీలోనూ ముద్రిస్తున్నట్టు అనుమానం
హైదరాబాద్‌లోని అనేక ప్రాంతాల్లో నకిలీ ధ్రువపత్రాలను ముద్రించే ముఠాలు ఉన్నట్లు సమాచారం. 2020 ఆగస్టులో నార్త్‌జోన్‌ పోలీసులు ఒక రైల్వే ఉద్యోగితోపాటు మొత్తం నలుగురిని అరెస్టు చేశారు. సెప్టెంబరులో జవహర్‌నగర్‌ పోలీసులు మాజీ ఆర్మీ ఉద్యోగిని అరెస్టు చేసి అతని నుంచి 300 సర్టిఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. పాతబస్తీలోనూ ఈ దందా నడుస్తున్నట్టు ఓయూ వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎక్కువగా మార్కెట్లో ఉద్యోగాలకు డిమాండ్‌ ఉన్న బీటెక్‌, ఎంబీఏ లాంటి వృత్తి విద్యా కోర్సులకు చెందిన వాటిని తయారు చేస్తున్నారు. విదేశాల్లో, ఇక్కడ ప్రైవేట్‌ పరిశ్రమల్లో ఉద్యోగాలు పొందడానికి, విదేశీ చదువు కోసం ఎక్కువ మంది ఈ దారి పడుతున్నారని వర్సిటీల అధికారులు చెబుతున్నారు. అప్పుడప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ అలాంటివి వస్తుండటం గమనార్హం.

తనిఖీల్లో దొరుకుతున్నాయ్‌...
గతంలో కేవలం కన్సాలిడేటెడ్‌ మార్కుల మెమో(సీఎంఎం)ను మాత్రమే పరిశీలించి విదేశీ, దేశీ పరిశ్రమలు ఉద్యోగాలు ఇచ్చేవి. హైదరాబాద్‌ నుంచి నకిలీ ధ్రువపత్రాలు ఎక్కువగా వస్తున్నట్లు అమెరికా కాన్సులేట్‌ నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి పలు మార్లు ఫిర్యాదులు అందాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పందించారు. వాటిని కట్టడి చేయాలని ఆదేశించారు. అయినా ఆశించిన మార్పు కనిపించడం లేదు. జేఎన్‌టీయూహెచ్‌ అధికారులు సైతం రెండేళ్ల క్రితం అమెరికా కాన్సులేట్‌ అధికారులతో సీఎంఎం కాకుండా ఒరిజనల్‌ డిగ్రీ(ఓడీ) సర్టిఫికెట్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. విశ్వవిద్యాలయాలు ఓడీల్లో వాటర్‌ మార్కు లాంటి అయిదారు రకాల భద్రతాంశాలను(సెక్యూరిటీ ఫీచర్స్‌ను) పొందుపరిచి ముద్రిస్తున్నాయి. అవన్నీ నకిలీల్లో తీసుకురావడం కష్టం. ఈక్రమంలో ఆయా కంపెనీలు ఉద్యోగాలకు ఎంపికైన వారి సర్టిఫికెట్లను తనిఖీ చేసి పంపాలని ఆయా వర్సిటీలకు థర్డ్‌ పార్టీ ఏజెన్సీ ద్వారా పంపిస్తున్నాయి. జేఎన్‌టీయూహెచ్‌కు ప్రతి నెల సగటున 1,500 ధ్రువపత్రాలు వస్తుండగా 2020లో 120 నకిలీవని తేల్చారు. కరోనా పరిస్థితుల్లో తగ్గాయని, ఏటా 300 వరకు నకిలీవి దొరుకుతున్నాయని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి.

పోలీసులు దృష్టిపెడితే...
ఓయూ పరీక్షల విభాగం అధికారులు తమ పరిశీలనకు ఆయా సంస్థలు పంపే ధ్రువపత్రాలను పరిశీలించి నకిలీవి ఉంటే మూడు నెలలకు ఒకసారి వెస్ట్‌ జోన్‌ పోలీసులకు నివేదిక అందజేస్తారు. ఆ తర్వాత వారు ఏంచేస్తున్నారు? ఎంత మందిని పట్టుకున్నారన్నది తమకు తెలియడం లేదని ఓయూ అధికారి ఒకరు తెలిపారు. జేఎన్‌టీయూహెచ్‌ మాత్రం పోలీసులకు సమాచారం ఇవ్వడం లేదు. పోలీసులు కూడా నకిలీ సర్టిఫికెట్లను ఎక్కడ తయారు చేశారు? ఎవరు తయారు చేశారో లోతుగా విచారణ జరిపితే తప్ప ఆ ముఠాలు కనుమరుగయ్యే పరిస్థితి లేదని జేఎన్‌టీయూహెచ్‌ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. కొన్ని సబ్జెక్టుల్లో తప్పిన వారు ఎక్కువగా నకిలీ పత్రాల కోసం ముఠాలను ఆశ్రయిస్తున్నారన్నారు.

నకిలీతో ఏడు సార్లు కొలువుకు ప్రయత్నం...
ఏడు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లిన ఒక వ్యక్తి అక్కడ ఉద్యోగంలో చేరాడు. రెండు సంవత్సరాల క్రితం మరో కంపెనీకి మారటడంతో ఆ సంస్థ ప్రతినిధులు తనిఖీ కోసం సర్టిఫికెట్‌ను జేఎన్‌టీయూహెచ్‌కు పంపారు. అది నకిలీదని తేల్చిన వర్సిటీ ఆ కంపెనీకి సమాచారం ఇచ్చింది. దాంతో అతనికి కొలువు దక్కలేదు. అప్పటి నుంచి అతను పలు కంపెనీల్లో ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అదే వ్యక్తి సర్టిఫికెట్లు ఈ రెండేళ్లలో ఏడు సార్లు తమ తనిఖీకి వచ్చాయని జేఎన్‌టీయూహెచ్‌ అధికారి ఒకరు తెలిపారు. తాజాగా రెండు నెలల క్రితం కూడా వచ్చినట్లు ఆయన చెప్పారు. ఏదైనా కంపెనీ తనిఖీ లేకుండా ఉద్యోగం ఇవ్వొచ్చనే అతను పలు కంపెనీలకు దరఖాస్తు చేస్తున్నట్లు భావిస్తున్నారు.

* ఇటీవల వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగానికి ఎంపికైన ఒకరి సర్టిఫికెట్లు జేఎన్‌టీయూహెచ్‌కు వచ్చాయి. ఎంసీఏ సర్టిఫికెట్లు నకిలీవని వర్సిటీ తేల్చింది.

ఇదీ చదవండి:

మన టీచర్​కు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి అభినందనలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.