చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం ద్వారకా నగర్ కు చెందిన.. సురేష్, శాంతి దంపతులు. వీరికి కౌశిక్(4) మౌనిక(3) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భర్త సురేష్.. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో.. శనివారం రాత్రి ఈ విషయంపై భార్యాభర్తలిద్దరూ గొడవపడ్డారు. కోపోద్రిక్తుడైన సురేష్.. భార్యను దారుణంగా హత్య చేసి పారిపోయాడు.
పిల్లలు చూస్తుండగానే ఈ దారుణానికి పాల్పడ్డాడు సురేష్. తమ కళ్ల ముందే తల్లిని చంపడం చూసిన పిల్లలు భయంతో గజగజవణికిపోతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని.. శాంతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు.