కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల కేంద్రంలో దారుణం జరిగింది. సహజీవనం చేస్తున్న జంటపై హత్యాయత్నం జరిగింది. ఈ ఘటనలో బజారి అనే వ్యక్తి మృతి చెందగా.. ఉరుకుందమ్మ అనే మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
ఉరుకుందమ్మ భర్తే దాడి చేశాడని.. తన భర్త మరొకరితో సహజీవనం చేస్తోందన్న కోపంతోనే అతను ఈ దారుణానికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. వేరొకరితో సహజీవనం కారణంగానే గతంలో వీరు విడిపోయినట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: