Ganja Seized : అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఏలూరు జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఏలూరు డీఎస్పీ పైడేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రం నుంచి తమిళనాడుకు తరలిస్తున్న 445 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. దీని విలువ రూ.45 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. ఇదే కాకుండా గంజాయి తరలిస్తున్న వ్యక్తుల నుంచి రెండు సెల్ ఫోన్లు, గంజాయి తరలిస్తున్న లారీని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.
విశాఖపట్నం చింతపల్లి ఏరియాకు చెందిన ధనుర్జై అనే వ్యక్తి 445 కిలోల గంజాయిని 15 బస్తాల్లో నింపుకుని తమిళనాడుకు తరిలించటానికి ప్రయత్నించాడు. తమిళనాడులోని గౌతం అని వ్యక్తికి ఇవ్వటానికి గంజాయిని లారీలో తరలిస్తుండగా.. జిల్లా ఎస్పీకి అందిన సమాచారం మేరకు ఆశ్రం జంక్షన్ వద్ద ఏలూరు రూరల్ పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నట్లు పేర్కొన్నారు.
ఇవీ చదవండి: