ETV Bharat / crime

pahadishareef murder case 2021 : వదినపై కోపంతో ఆమె నాలుగేళ్ల కుమారుడిని చంపేశాడు! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

వదినమీద కోపంతో అభంశుభం తెలియని చిన్నారిని పొట్టనబెట్టుకున్నాడు(pahadishareef murder case 2021) ఓ కర్కశుడు. వదిన వల్ల తమ సంసారం సరిగ్గా సాగడం లేదనే కోపంతో నాలుగేళ్ల పసివాడి ప్రాణాలు తీశాడు. చిన్నారి తలపై గట్టిగా కొట్టి హతమార్చాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్​లోని పహాడిషరీఫ్​ పరిధిలో చోటుచేసుకుంది.

four-years-old-boy-murdered-by-his-uncle-over-grudge-against-his-mother-at-pahadi-shareef-in-rangareddy
వదినపై కోపంతో ఆమె నాలుగేళ్ల కుమారుడిని చంపేశాడు!
author img

By

Published : Nov 21, 2021, 9:15 AM IST

తమ సంసారం సవ్యంగా సాగనీయడం లేదనే కోపంతో వదిన కొడుకు, అదీ నాలుగేళ్ల పసివాడి ప్రాణాలు(pahadishareef murder case 2021) తీశాడో కర్కోటక మరిది. శనివారం చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనపై హైదరాబాద్ మైలార్‌దేవుపల్లి ఇన్‌స్పెక్టర్‌ నరసింహ, పహాడీషరీఫ్‌ ఎస్సై హయ్యూంల కథనం ప్రకారం... కర్నూలు జిల్లా ఎమ్మిగనూరుకు చెందిన మహేశ్వరి హైదరాబాద్‌లో జూనియర్‌ ఆర్టిస్టుగా పనిచేసేది. పెద్దలు రాజుతో వివాహం చేయడంతో స్వగ్రామానికి వెళ్లిపోయింది. వారికి ఇద్దరు ఆడపిల్లలు. ఆరేళ్ల క్రితం రాజు మృతిచెందాడు. ఒంటరిగా పిల్లల పోషణ భారం కావడంతో అయిదేళ్ల క్రితం వినోద్‌కుమార్‌రెడ్డిని రెండో పెళ్లి చేసుకుని నగరానికి తిరిగివచ్చింది. రాజేంద్రనగర్‌ లక్ష్మీగూడలో రాజీవ్‌గృహకల్పలో స్థిరపడింది. గ్రామంలో ఉండే చెల్లెలు లక్ష్మి, ఆమె భర్త వీరేశ్‌లను అక్కడకు తీసుకొచ్చింది. రెండో భర్తతో ఆమెకు కుమారుడు లక్ష్మీనరసింహ అలియాస్‌ లక్కీ(4) పుట్టాడు. ఆపై రెండో భర్త ఆమెను వదిలిపోవటంతో మహేశ్వరి చెల్లెలు ఇంట్లోనే ఉంటోంది.

అక్క మాటలతో భార్య తనని నిర్లక్ష్యం చేస్తోందని..

ఒకే ఇంట్లో ఉంటుండడంతో అక్క మాటలు వింటూ.. భార్య లక్ష్మి తనను నిర్లక్ష్యం చేస్తోందని వీరేశ్‌ ఆగ్రహంగా ఉన్నాడు. వదినపై కోపం పెంచుకున్నాడు. శనివారం ఉదయం వదిన కుమారుడు లక్ష్మీనరసింహను ఎత్తుకుని బయటకు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం వరకూ ఎదురుచూసిన అక్కాచెల్లెళ్లు వీరేశ్‌ ఎంతకూ తిరిగిరాకపోవటంతో భయాందోళనకు గురై వెంటనే మైలార్‌దేవుపల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. సాయంత్రం కాటేదాన్‌లో కనిపించిన వీరేశ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారించగా దారుణం వెలుగుచూసింది. ఉదయం బాలుడు లక్కీతో బయటకి వెళ్లిన వీరేశ్‌.. ఆ చిన్నారిని జల్‌పల్లి పారిశ్రామికవాడలోని ఖాళీ గోదాములోకి తీసుకెళ్లాడు. ఉరివేసేందుకు యత్నించగా చిన్నారి తప్పించుకోవడంతో.. పట్టుకుని తలపై గట్టిగా కొట్టి హతమార్చాడు(4 years boy murder case). అదేరోజు రాత్రి నిందితుడు పోలీసులకు బాలుడి మృతదేహాన్ని చూపించాడు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పహాడి షరీఫ్ పోలీసులు ఘటన స్థలానికి(pahadi shareef murder case) చేరుకున్నారు. క్లూస్ టీంను రప్పించి ఆధారాలు సేకరించినట్లు పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. పరారీలో ఉన్న నిందితుడు వీరేష్ రెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.