ACCIDENT: బంధువుల వివాహానికి హాజరై తిరుగు ప్రయాణమైన ఆ కుటుంబాన్ని రోడ్డు ప్రమాదం బలితీసుకుంది. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం 150వ మైలు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న గంగిరెడ్డి, మధులత, కుషితారెడ్డి, దేవాన్ష్‌రెడ్డి మృతి చెందారు. నిమ్మనపల్లి మండలం రెడ్డి వారిపల్లెలో నివాసముంటున్న గంగిరెడ్డి పలమనేరులో తమ బంధువుల పెళ్లి వేడుకకు హాజరై తెల్లవారుజామున మదనపల్లి బయలుదేరాడు. మదనపల్లె మండలం 150వ మైలు వద్దకు చేరుకోగానే డ్రైవింగ్‌లో ఉన్న గంగిరెడ్డి నిద్రలోకి జారుకున్నాడు. కారు అదుపు తప్పి, కుడి వైపున ఉన్న వంతెనను ఢీకొని చెరువులో పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మదనపల్లె రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను బయటకు తీసి మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: