కర్నూలు జిల్లా ఆదోనిలో ప్రమాదవశాత్తు పురపాలక కార్యాలయానికి చెందిన చెత్త లారీ దగ్ధం అయ్యింది. పట్టణ శివారు బైపాస్ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. చెత్త తరలించే లారీలో బ్యాటరీ కాలిపోవడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయని లారీ డ్రైవర్ చెబుతున్నారు. వెంటనే కిందకు దిగి అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చినట్లు తెలిపారు. వారు సకాలంలో వచ్చి మంటలార్పడంతో భారీ ప్రమాదం తప్పిందని వివరించారు.
ఇదీ చూడండి:
Bypolls in India 2021: దేశవ్యాప్తంగా ఉపఎన్నికల పోలింగ్ ప్రారంభం