నెల్లూరు జిల్లా అనంతసాగరంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అగ్నిప్రమాదం(FIRE ACCIDENT) చోటు చేసుకుంది. రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో.. ఆస్పత్రి లోపల షార్ట్ సర్క్యూట్ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ఆస్పత్రిలో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
కానీ ఆరోగ్య కేంద్రంలో ఉన్న ఫర్నీచర్, ఫ్రిడ్జ్‌లు, ఫ్యాన్లతో పాటు పలు రకాల మందులు దగ్ధమయ్యాయి. మంటలను గుర్తించిన వాచ్మెన్ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు ఘటనాస్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పివేశారు.
ఇదీ చూడండి: Ap new cabinet: కొత్త మంత్రిమండలి కూర్పుపై మంతనాలు షురూ