ETV Bharat / crime

ACCIDENT: బైకును ఢీ కొట్టిన కారు.. భర్త మృతి, భార్య.. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు - గుంటూరులో రోడ్డు ప్రమాదం

అప్పటి వరకూ సాఫీగా సాగుతున్న వారి ప్రయాణాన్ని మృత్యురూపంలో దూసుకొచ్చిన కారు చిదిమేసింది. ప్రమాదం జరిగిందని తేరుకునే లోపే తండ్రి చనిపోయాడు. ఇద్దరు చిన్న పిల్లలకు తీవ్రగాయాలయ్యాయి. తల్లి నిశ్చేష్టురాలై ఉండిపోయింది. తండ్రి మరణం.. గాయాలతో సాయం కోసం ఎదురుచూస్తూ పిల్లలు చేస్తున్న ఆర్తనాదాలు అక్కడి వారందర్నీ కలచివేశాయి. పండగకు వెళ్తుండగా ప్రమాదం జరగడంతో వారి కుటుంబంలో విషాధచాయలు అలముకున్నాయి. వేగంగా దూసుకువచ్చిన కారు ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఒకరు అక్కడిక్కడే ప్రాణాలుకోల్పోగా.. ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలో జరిగింది.

ACCIDENT
రోడ్డు ప్రమాదం
author img

By

Published : Jul 20, 2021, 9:08 AM IST

తొలి ఏకాదశి పండుగ కోసం ద్విచక్ర వాహనంపై కుటుంబమంతా కలిసి బయల్దేరింది. మరి కొద్ది గంటల్లో.. తల్లిగారి ఇంటికి చేరుకుంటామని ఆ గృహిణిలో ఆనందం.. అమ్మమ్మ, తాతయ్య వాళ్లింట్లో హాయిగా ఆడుకోవచ్చని ఆ దంపతుల ఇద్దరు పిల్లల్లో ఉత్సాహం.. వారిని సంతోషంగా ముందుకు కదిలించింది. కానీ.. వారంతా ఒకలా తలిస్తే.. విధి వక్రించి మరోలా తలిచింది. దారిలో ఆ కుటుంబం ప్రమాదం బారిన పడింది. కారు రూపంలో మృత్యువు ముంచుకొచ్చింది. ఆ కుటుంబాన్ని అల్లకల్లోలం చేసింది. ఇంటి పెద్దను దూరం చేసింది. మిగిలిన ముగ్గురినీ తీవ్ర గాయాలపాలు చేసింది. కేవలం.. చిన్నపాటి నిర్లక్ష్యం.. ఎదుటివారి అతి వేగమే.. ఈ విషాదానికి కారణమైంది. గుంటూరు జిల్లా మాచర్ల సమీపంలో జరిగిన ఈ ఘటన.. అందరినీ కంటతడి పెట్టించింది.

గమ్యం చేరే క్రమంలో...

తెలంగాణలోని నల్గొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల గ్రామానికి చెందిన నారబోయిన సైదులు (34), భార్య రాజేశ్వరి, ఇద్దరు పిల్లలతో కలిసి బైక్ పై.. రాజేశ్వరి తల్లి గారి ఇంటికి బయల్దేరారు. గుంటూరు జిల్లా గురజాల మండలం గొట్టిముక్కల గ్రామానికి చేరుకునే క్రమంలో.. మాచర్ల మండలం రాయవరం కూడలివరకూ బాగానే ప్రయాణం పూర్తి చేశారు. అక్కడ.. ఎదురుగా అతి వేగంగా వచ్చిన కారు.. సైదులు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో సైదులు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటనా స్థలంలోనే విలవిల్లాడుతూ ప్రాణాలు విడిచాడు.

ప్రమాదంలో సైదులు భార్య, ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలు

ఈ ఘటనలో సైదులు భార్య రాజేశ్వరి, పిల్లలు రోహిత్, చేతనశ్రీ తీవ్ర గాయాలపాలయ్యారు. భర్త మరణానికి తోడు.. తనకు తగిలిన గాయాలతో రాజేశ్వరి అచేతనంగా రోడ్డుపై పడి ఉండడం.. చిన్నారులు తీవ్ర గాయాలతో ఆర్తనాదాలు చేయడం.. స్థానికులను తీవ్రంగా కలిచివేసింది. గాయాలపాలై ప్రాణాపాయంతో ఉన్న ఆ ముగ్గురిని స్థానికులు, పోలీసులు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మాచర్ల రూరల్ పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేశారు.

వాహనాలపై దూర ప్రయాణాలు చేస్తున్నప్పుడు.. అదీ పిల్లలతో కలిసి వెళ్తున్నప్పుడు.. ఎంతో జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఈ ఘటన మరోసారి గుర్తు చేసింది. తప్పు ఎదుటివారిదైనా సరే.. అంతిమ ఫలితాన్ని మనమే అనుభవించాల్సివస్తే.. ఇంటి పెద్దను కోల్పోవాల్సి వస్తే.. మిగిలిన కుటుంబ సభ్యులకు ఎంతటి మానసిక క్షోభ మిగులుతుందన్నదీ.. సైదులు కుటుంబాన్ని చూసైనా అంతా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇదీ చదవండి:

Rape: మనుమరాలిపై తాత అత్యాచారం కేసు.. వైద్య పరీక్షల్లో ఏం తేలిందంటే?

'అమ్మాయిల వివాహ వయస్సు 20ఏళ్లకు పెంపు'!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.