ETV Bharat / crime

'స్టేషన్​కు పిలిపించారు.. ఇంటికి పంపమన్నందుకు చితకబాదారు'

D-Hirelal SI: ఇరుగు పొరుగు వివాదంలో నెల రోజుల క్రితం కోర్టులో ఫిర్యాదు చేసిన తమను తాజాగా స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు.. ‘రాత్రి అయ్యింది ఇంటికి పంపించండి’ అన్న పాపానికి చితకబాదారని బాధిత కుటుంబసభ్యులు ఆవేదన చెందారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో జరిగింది.

attack
ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న హేమంత్‌
author img

By

Published : Apr 29, 2022, 9:32 AM IST

allegations on D-Hirelal SI: ఓ కేసు విషయంలో పోలీసుస్టేషన్​కు పిలిపించి డి హిరేహాల్‌ ఎస్సై రామకృష్ణారెడ్డి.. తమ తండ్రిని చితకబాదారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇరుగు పొరుగు వివాదంలో నెల రోజుల క్రితం కోర్టులో ఫిర్యాదు చేయగా.. తాజాగా తమను పోలీస్​స్టేషన్​కు పిలిపించి... రాత్రి అయినా ఇంటికి పంపించలేదన్నారు. ఇదే విషయాన్ని అడిగితే.. చితకబాదారన్నారు. పోలీసులు దాడిలో గాయపడ్డ బాధితుడు హేమంత్‌ అనంతపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని మురడి గ్రామానికి చెందిన హేమంత్‌కు కుమారుడు మంజునాథ్‌, కుమార్తె మీనాక్షి ఉన్నారు. మంజునాథ్ భార్య కుటుంబసభ్యులతో నెల కిందట గొడవ జరగ్గా.. డి హిరేహాల్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసు విషయమై పోలీసులు హేమంత్ కుటుంబాన్ని స్టేషన్‌కు పిలిపించారు. చీకటిపడటంతో భార్య, కుమార్తెను ఇంటికి పంపించాలని తమ తండ్రి కోరగ్గా.. ఆగ్రహించిన ఎస్పై రామకృష్ణారెడ్డి లాఠీతో సృహ కోల్పోయేలా కొట్టారని బాధితుడి పిల్లలు చెబుతున్నారు. తల్లిని, తనను మహిళలు అని కూడా చూడకుండా దూషించారని మీనాక్షి ఆరోపించారు.

ఇదీ చదవండి: Protocol Issue: పిలిచి అవమానిస్తారా? అధికారులపై ఎమ్మెల్యే ఫైర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.