Driver rapes woman: Rape In Private Travels Bus: ఊరు వెళ్లేందుకు బస్సు ఎక్కిన తనపై డ్రైవర్ అఘాయిత్యానికి పాల్పడ్డాడని ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ మహిళ ఆరోపించింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని సొంత గ్రామానికి వెళ్లేందుకు ఈ నెల 23న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఎక్కినట్లు తెలిపింది. బస్సులో లగేజీ మాత్రమే తరలించి.. రైలు ఎక్కాల్సి ఉన్నా బస్సులో సీటు కేటాయిస్తామని డ్రైవర్ రాజేష్ ఇచ్చిన హామీతో బస్సు ఎక్కినట్లు పేర్కొంది.
3 వేలు తీసుకుని చివరి స్లీపర్ బెర్త్ ..
3 వేలు తీసుకుని చివరి స్లీపర్ బెర్త్ కేటాయించిన డ్రైవర్.....అర్థరాత్రి ఆమె వద్దకు వెళ్లి కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు తెలిపింది. బస్సు దిగే సమయంలో దొంగతనం నెపంతో 7 వేల రూపాయలు లాక్కున్నట్లు ఆరోపించింది. నిందితుడు రాజేష్ పై కఠినమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు డిమాండ్ చేసింది.
పోలీసుల అదుపులో డ్రైవర్..
అత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు జేఎన్టీయూ నుంచి రాజ్‌భవన్ వెళ్తున్న గవర్నర్ కాన్వాయ్‌ను కూకట్‌పల్లిలో అడ్డుకునేందుకు యత్నించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషనుకు తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు కూకట్‌పల్లి సీఐ నర్సింగరావు తెలిపారు. నిందితుడు రాజేష్ పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: పోలీసులను ఆశ్రయించిన ప్రియురాలు... ప్రియుడు ఏం చేశాడంటే