Crackers blast in West Godavari district: పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం కడియద్దలోని బాణసంచా కర్మాగారంలో జరిగిన పేలుడు ప్రదేశాన్ని ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పరిశీలించారు. బాణ సంచా తయారీ కేంద్రానికి అనుమతి ఉందని.. కేవలం 15 కేజీల మందుగుండు నిల్వా చేసుకునేందుకే అనుమతులున్నాయని ఆయన తెలిపారు. అయితే, ప్రమాద తీవ్రత చూస్తుంటే అనుమతి కంటే ఎక్కువ మందు గుండు ఇక్కడ నిల్వ చేసినట్లు తెలుస్తోందని పేర్కొన్నారు. పేలుడులో ఇద్దరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. మరో వ్యక్తి చెరువులో పడ్డారేమో అని గాలింపు చేపట్టారు. ప్రమాదం జరిగినప్పుడు కర్మాగారంలో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు గర్తించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి.. పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. తయారీ కేంద్రం నిర్వాహకుడు ఇంకా అందుబాటులోకి రాలేదని తెలిపారు.
ఇవీ చదవండి: