ETV Bharat / crime

Cloth merchant IP: ఐపీ పెట్టిన బట్టల వ్యాపారి...ఎంతో తెలిస్తే షాక్​.. - పెనుమలూరులో ఐపీ కేసు

చిత్తూరు జిల్లా పెనుమూరులో ఓ బట్టల వ్యాపారి రూ. 90 కోట్ల మేర ఐపీ పెట్టాడు. తమ డబ్బు ఇప్పించాలంటూ బాధితులు నిరసన చేపట్టారు.

Cloth merchant IP at penumuluru
Cloth merchant IP at penumuluru
author img

By

Published : Oct 6, 2021, 5:56 PM IST

బాధితుల నిరసన

చిత్తూరు జిల్లా పెనుమూరులో ఓ బట్టల వ్యాపారి అప్పుగా తీసుకున్న సొమ్ము చెల్లించకుండా.. ఎగ్గొట్టాడని బాధితులు ఆందోళన చేపట్టారు. తమ డబ్బు ఇప్పించాలంటూ నిరసన వ్యక్తం చేశారు. బట్టల వ్యాపారిని అరెస్ట్​ చేయాలని బాధితులు డిమాండ్​ చేశారు.

పెనుమూరులోని బజారివీధిలో దుస్తుల వ్యాపారం చేస్తున్న పాండురంగయ్య.. వ్యాపారం కోసం సూమారు రూ. 90 కోట్లు అప్పు చేశాడు. పెనుమూరు, వెదురుకుప్పం, పాకాల, పూతలపుట్టు మండలాలకు చెందిన 998 మంది నుంచి 90 కోట్ల రూపాయల మేర అప్పు చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యాపార నిర్వహణలో భాగంగా అవసరమైనప్పుడు తమ నుంచి రుణం తీసుకునేవాడని.. క్రమం తప్పకుండా నెల నెలా వడ్డీ ఇవ్వడంతో నమ్మకం కలిగి నగదు ఇచ్చామని బాధితులు అంటున్నారు. అప్పు తీర్చలేని పరిస్థితి ఏర్పడడంతో చిత్తూరు న్యాయస్థానం ద్వారా ఇన్‌సాల్వెన్సీ పిటిషన్‌ (ఐపీ) వేయడంతో బాధితులు రోడ్డెక్కారు.

ఇదీ చదవండి:

తితిదే బోర్డులో నేర చరితుల నియామక పిటిషన్​పై హైకోర్టులో విచారణ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.