CLASHES BETWEEN TWO TEAMS BAR AT VIJAYAWADA : విజయవాడ వాల్ట్ బ్రేవరీ బార్లో మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య నెలకొన్న వివాదం చివరకు ఇరువర్గాల ఘర్షణకు దారితీసింది.వంశీ అనే యువకుడితో పాటు హర్షవర్థన్, అతని స్నేహితులు బార్‌కు వచ్చారు. మద్యం మత్తులో ఉన్న యువకులు.. ఒకరినొకరు దూషించుకోవడంతో ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో నవీన్ అనే యువకుడిపై హర్షవర్థన్, అతని స్నేహితులు దాడి చేశారు. దాడిలో గాయపడిన నవీన్‌ని నగరంలోని లిబర్టీ హాస్పిటల్‌కి తరలించి వైద్య చికిత్స అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవల నగరంలో గ్యాంగ్ వార్ , ఆధిపత్య పోరు నడుస్తున్న క్రమంలో యువకుల మధ్య ఘర్షణ, దాడి చేసుకోవడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు యువకులు మధ్య ఘర్షణకు గల కారణాలు, వీరందరూ ఎక్కడివారనే కోణంలో విచారిస్తున్నారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి: