CISF JAWAN SUICIDE: తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో సీఐఎస్ఎఫ్ జవాన్ ఘటన విషాదాంతంగా ముగిసింది. ముక్కుపచ్చలారని ఇద్దరు పిల్లలను బావిలో పడేసి చంపిన సీఐఎస్ఎఫ్ జవాన్.. అనంతరం తానూ బలవన్మరణానికి పాల్పడ్డాడు. మహబూబాబాద్ పరిధిలోని అనంతారం శివారులో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రామ్‌కుమార్.. ముంబయిలో సీఐఎస్‌ఎఫ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు.
భార్యతో గొడవపడి..
cisf jawan mahabubabad: సీఐఎస్‌ఎఫ్ జవాన్‌గా పనిచేస్తున్న రామ్‌కుమార్.. మూడు రోజుల క్రితమే సెలవుపై స్వగ్రామమైన మహబూబాబాద్ మండలం గడ్డిగూడెం తండాకు వచ్చాడు. భార్యతో గొడవపడి తన ఇద్దరు పిల్లలను బావిలో తోసి చంపేశాడు. అనంతరం తాను కూడా రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రామ్‌కుమార్ మృతదేహాన్ని గుర్తుపట్టిన భార్య, సోదరుడు శోకసంద్రంలో మునిగిపోయారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న చిన్నారులతో పాటు తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడడంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
ఇదీ చూడండి: