గుంటూరు జిల్లాలోని బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల సెకండ్ షిఫ్ట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 6న నిర్వహించిన పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం ప్రశ్నపత్రం లీకు వ్యవహారంలో ముగ్గురు అధ్యాపకులపై కేసు నమోదు చేసినట్లు బాపట్ల గ్రామీణ సీఐ శ్రీనివాసరెడ్డి సోమవారం తెలిపారు. ప్రశ్నపత్రం లీకు చేశారంటూ రాష్ట్ర సాంకేతిక విద్యామండలి పరీక్షల విభాగం సంయుక్త కార్యదర్శి జానకిరామయ్య ఫిర్యాదు చేశారన్నారు.
ఈ ఫిర్యాదు మేరకు ఏ1గా ప్రశ్నపత్నం లీకు చేసిన అధ్యాపకురాలు ఏవీ రమాదేవి, ఏ2గా పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ టి.ప్రవీణ్‌కుమార్, ఏ3గా అదనపు సూపరింటెండెంట్ జి.హనుమంతరావుపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ప్రశ్నపత్రం లీకు ఘటనపై రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి ముగ్గురు సభ్యుల కమిటీతో నిర్వహించిన అంతర్గత విచారణ నివేదికను పోలీసులకు జానకీ రామయ్య అందజేశారు.
ఇదీ చదవండి:
చంద్రబాబు ప్రచారంలో రాళ్ల దాడి... గవర్నర్, ఈసీకి ఫిర్యాదు చేసేందుకు నిర్ణయం