తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. హిమాయత్ సాగర్ టోల్గేట్ సమీపంలో అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన బైక్ను తప్పించబోయిన టిప్పర్ వాహనం ఎదురుగా వస్తున్న మరో టిప్పర్ను ఢీ కొట్టింది.
ఘటనలో ఇద్దరు టిప్పర్ డ్రైవర్లకు గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వారిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన రాజేంద్ర నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: చల్లగా షి'కారు'.. మట్టి, పేడతో కోటింగ్