బాలీవుడ్ డ్రగ్స్ కేసులో పరారీలో ఉన్న మరో నిందితుడిని ముంబై ఎన్సీబీ అధికారులు.. హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. బాలీవుడ్ నటుడు సుశాంత్‌సింగ్ రాజపుత్ ఆత్మహత్య కేసులో.. డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది. ఆ కేసులో ఇప్పటికే ముంబై ఎన్సీబీ (NCB) అధికారులు పలువురిని విచారించగా గతంలో సిద్దార్ధ్ పితాని అనే వ్యక్తిని విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చారు.
విచారణకు రాకుండా తప్పించుకు తిరుగుతుండటంతో అతని కోసం ఓ ప్రత్యేక బృందం ఇటీవలే హైదరాబాద్ వచ్చింది. ఎన్సీబీ అధికారులు స్థానిక పోలీసుల సాయతో సిద్దార్ధ్‌ని.. గురువారం అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచిన తర్వాత ట్రాన్సిట్ వారెంట్‌పై ముంబై తీసుకువెళ్ళిన అధికారులు.. ముంబై కోర్టులో హాజరుపర్చగా జూన్ 1 వరకు విచారణకు అనుమతించింది.
ఇవీ చూడండి: వైరల్: పోలీస్‌ను చితకబాదిన గ్రామస్థులు