ETV Bharat / crime

TOLLYWOOD DRUGS CASE: కెల్విన్‌కు డబ్బు పంపారా? ఛాటింగ్‌ చేశారా?

Tollywood drugs case
Tollywood drugs case
author img

By

Published : Sep 2, 2021, 6:37 PM IST

Updated : Sep 3, 2021, 5:26 AM IST

18:35 September 02

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసు

టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో ముగిసిన నటి చార్మి విచారణ

 తెలుగు సినీ పరిశ్రమ మత్తుమందుల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. గత నెల 31న సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ విచారణకు హాజరు కాగా.. గురువారం నటి ఛార్మి ఈడీ కార్యాలయానికి వచ్చారు. తన ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌తో కలిసి వచ్చిన ఆమెను అధికారులు దాదాపు 8 గంటలపాటు ప్రశ్నించారు. కార్యాలయంలోని మూడో అంతస్తులో ఈడీ సంయుక్త సంచాలకుడు అభిషేక్‌ గోయల్‌ నేతృత్వంలోని బృందం విచారించింది. తన రెండు బ్యాంకు ఖాతాల వివరాల్ని ఛార్మి అధికారులకు సమర్పించారు. వాటిలో తమకు అనుమానంగా కనిపించిన లావాదేవీల గురించి అధికారులు ప్రశ్నించారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. మాదకద్రవ్యాల

సరఫరాదారు కెల్విన్‌తో గల సంబంధాల గురించి అధికారులు ఆరా తీశారు. మాదకద్రవ్యాల కొనుగోలు నిమిత్తం కెల్విన్‌కు డబ్బు ఇచ్చారా..? అని ప్రశ్నించారు. కెల్విన్‌తో ఫోన్‌ సంభాషణలు, వాట్సప్‌ ఛాటింగ్‌ చేశారా..? అని అడిగారు. ఆన్‌లైన్‌లో అతడి ఖాతాకు డబ్బు పంపించారా..? అని ఆరా తీశారు. దాదా పేరుతో ఉన్న ఫోన్‌ నంబరుకు కాల్స్‌ చేశారా..? అని ప్రశ్నించారు. అయితే కెల్విన్‌ గురించి తనకేమీ తెలియదని.. అతడితో తనెలాంటి లావాదేవీలు జరపలేదని ఛార్మి బదులిచ్చినట్లు తెలిసింది. దర్శకుడు పూరి జగన్నాథ్‌తో ఛార్మి వ్యాపార లావాదేవీలు కలిగి ఉండటంతో వాటి గురించీ ఆరా తీసినట్లు సమాచారం. ఈక్రమంలో అవసరమైతే మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అధికారులు ఆమెను పంపించివేశారు.

దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తా : ఛార్మి

ఈడీ విచారణ అనంతరం కార్యాలయం బయట ఛార్మి మీడియాతో మాట్లాడారు. ‘ఈడీ అధికారులు సమన్లు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యా. అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలిచ్చా. నన్ను అడిగిన అన్ని బ్యాంకు పత్రాలను ఈడీ అధికారులకు సమర్పించా. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తా. ఎప్పుడు విచారణకు పిలిచినా వస్తా. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది. అందుకే కేసు గురించి ఎక్కువ మాట్లాడను..’ అంటూ రెండు చేతులు జోడించారు.

నేడు రకుల్‌ప్రీత్‌సింగ్‌ విచారణ

మత్తుమందుల కేసులో ఈడీ అధికారులు 12 మంది సినీప్రముఖులకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు ఎన్‌డీపీఎస్‌ చట్టం కింద 2017లో నమోదు చేసిన కేసు దర్యాప్తు ఆధారంగా వీరిలో ఒక్కొక్కరిని విచారణకు పిలిచారు. ఈనెల 22 వరకు ఈ విచారణ జరగనుంది. ఈనెల 6న విచారణకు రావాలని రకుల్‌ప్రీత్‌సింగ్‌కు సమన్లు జారీ చేశారు. అయితే ఆ రోజు విచారణకు వచ్చేందుకు తనకు వీలు కాదని.. మరికొంత సమయం ఇవ్వాలని రకుల్‌ ఈడీ అధికారులకు విజ్ఞప్తి చేశారు. కానీ తర్వాతి రోజుల్లో పలువురిని విచారించే అవకాశముండటంతో ఆమె విజ్ఞప్తిని ఈడీ తిరస్కరించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం విచారణకు హాజరు కావాలని అధికారులు సూచించడంతో వచ్చేందుకు రకుల్‌ అంగీకరించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఈడీ వర్గాలు ధ్రువీకరించాయి.

ఇదీ చదవండి: 

Heroine Charmikour: డ్రగ్స్ కేసు విచారణ.. ఈడీ ముందుకు సినీనటి చార్మికౌర్

Bandla Ganesh: నాకెందుకు ఇస్తారయ్యా నోటీసులు... నేనసలు వక్కపోడే వేసుకోను!

Tollywood Drugs Case: డ్రగ్స్ కేసులో.. నిందితుల ఆర్థిక లావాదేవీలపై ఈడీ దర్యాప్తు!

Last Updated : Sep 3, 2021, 5:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.