ETV Bharat / crime

20 YEARS PRISON: బాలికపై లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష - మైనర్​పై లైంగిక దాడి కేసులో నిందితుడికి జైలు శిక్ష

ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో నిందితుడికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.4వేలు జరిమానా విధిస్తూ పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరించింది. తెలంగాణలోని జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లికి చెందిన నిందితుడు తోడేటి రమేశ్​ను ఈ కేసులో దోషిగా తేల్చింది న్యాయస్థానం.

accused-of-sexually-assaulting-on-a-minor-girl-sentenced-to-20-years-in-prison-and-4-thousand-fine
బాలికపై లైంగికదాడి కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష
author img

By

Published : Nov 27, 2021, 9:45 AM IST

బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి పోక్సో కేసుల ప్రత్యేక న్యాయస్థానం శిక్షను విధించింది. తెలంగాణలోని జయశంకర్​ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం కర్కపల్లికి చెందిన నిందితుడు తోడేటి రమేశ్​కు... 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.4వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.

విచారణ సాగిందిలా..

2018 అక్టోబర్​ 12న నిందితుడు రమేశ్​.. 8 ఏళ్ల బాలికకు గుట్కా తీసుకురమ్మని కిరాణా దుకాణానికి పంపాడు. గుట్కా తెచ్చిన బాలికను ఇంట్లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాలిక తన కుటుంబ సభ్యులకు తెలియజేయడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై అచ్యాచార కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా ఘటనకు సంబంధించి పూర్తి సాక్ష్యాధారాలను సేకరించారు. అప్పటి ములుగు డీఎస్​పీ విజయ సారథి నిందితుడిని అరెస్టు చేసి.. ఛార్జిషీట్​ ఫైల్​ చేశారు. అనంతరం కోర్టు డ్యూటీ ఆఫీసర్​ వి.రవీందర్​ సాక్ష్యులను ప్రవేశపెట్టారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్​ తరఫున పబ్లిక్​ ప్రాసిక్యూటర్​ సీహెచ్​ సత్యనారాయణ వాదించారు. బాధిత బాలిక సాక్ష్యంతో పాటు, పోలీసులు ప్రవేశపెట్టిన సాక్ష్యులు, ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం నిందితుడు రమేశ్​ను దోషిగా తేల్చి ఇవాళ తుదితీర్పు వెలువరించింది.

ఈ కేసులో బాధిత బాలికకు న్యాయం జరిగేలా.. నిందితుడి శిక్షపడేలా సాక్ష్యాధారాలు సేకరించడం, ప్రవేశపెట్టడంలో శ్రద్ధ చూపిన భూపాలపల్లి డీఎస్పీ ఏ సంపత్​రావు, గణపురం ఎస్సై ఉదయ్​ కిరణ్​ను నాలుగవ జిల్లా కోర్టు వరంగల్​ వారు అభినందించారు.

ఇదీ చూడండి: పరాయి మహిళ ఒడిలో ఎస్సై సేద తీరుతున్నాడు.. ఆమె భర్త తలుపు తీశాడు!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.