కూలీ పనుల కోసం పట్ణణానికి వెళ్లిన మహిళ తిరిగి ఇంటికి చేరలేదు. మరుసటి రోజు ఓ ఫాం హౌజ్ సమీపంలోని నాలాలో శవమై కనిపించింది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా ధరూరు మండలం అవుసుపల్లి గ్రామానికి చెందిన అమృతమ్మ (40) అడ్డాకూలీ. గురువారం వికారాబాద్‌కు పనికి వెళ్లిన అమృతమ్మ.. రాత్రైనా ఇంటికి చేరకపోవడంతో కుటుంబసభ్యులు బంధువులు, తెలిసిన వారిని ఆరా తీశారు. ఆమె కోసం గాలించారు. కానీ ఆచూకీ దొరకలేదు.
ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదృశ్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గెరిగేట్‌పల్లి రైల్వే వంతెన వద్ద ఓ ఫాం హౌజ్ సమీపంలోని నాలాలో మహిళ మృతదేహం ఉందని తెలుసుకున్నారు. ఆ శవం అమృతమ్మది అని గుర్తించిన బంధువులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఆమెను అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: