ETV Bharat / crime

Rape on Minor girl: బాలికపై యువకుల అత్యాచారం.. గర్భం దాల్చిన బాధితురాలు..ఎక్కడంటే? - నారాయణపేటలో మైనర్ బాలికపై అత్యాచారం

Rape on Minor girl in narayanapet : హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ గ్యాంగ్ రేప్ అనంతరం బాలికలపై అత్యాచారాల ఉదంతాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఓ మైనర్ బాలికపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడగా ఆమె గర్భం దాల్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Rape on Minor girl
బాలికపై యువకుల అత్యాచారం.. గర్భం దాల్చిన బాధితురాలు..ఎక్కడంటే?
author img

By

Published : Jun 8, 2022, 10:31 AM IST

Rape on Minor girl in narayanapet : ఒంటరిగా ఉన్న బాలికపై కన్నేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి పథకం పన్నారు. ఇంటి వద్ద బాలిక ఒక్కతే ఉండటం గమనించిన ఇద్దరు యువకులు ఆమెను ఇంట్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత మరొకకు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

పోలీసుల కథనం ప్రకారం.. కోయిలకొండ మండలంలోని ఓ గ్రామానికి చెందిన 13 ఏళ్ల బాలిక రెండు నెలల కిందట ఇంటి వద్ద ఒంటరిగా ఉండగా..అదే మండలానికి చెందిన రవికుమార్‌, అతని స్నేహితుడు శ్రీకాంత్‌ గమనించారు. బాలికను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి ఒడిగట్టారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.

బాలిక ఇటీవల అస్వస్థతకు గురికావటంతో తల్లి ఆసుపత్రికి తీసుకెళ్లారు. గర్భం దాల్చినట్లు వైద్యులు నిర్ధారించిన నేపథ్యంలో బాలిక నోరువిప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు నిందితులను విచారించామని, వారు నేరాన్ని అంగీకరించారని ఎస్సై శీనయ్య తెలిపారు. ఇద్దర్నీ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.