ETV Bharat / crime

brother attack: అన్నదమ్ముల మధ్య ఘర్షణ.. ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చింది ! - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

అన్నదమ్ముల నడుమ చెలరేగిన ఘర్షణలు ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చాయి. చిన్న చిన్న గొడవలు కాస్తా... గొంతుకోసే దాకా వచ్చాయి. అర్ధరాత్రి.. క్షణికావేశంలో తమ్ముడు అన్న గొంతు కోయగా.. బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జరిగింది.

అన్నదమ్ముల మధ్య ఘర్షణ
అన్నదమ్ముల మధ్య ఘర్షణ
author img

By

Published : Oct 25, 2021, 4:55 PM IST

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దీపూర్‌లో అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ కాస్తా... ప్రాణాల మీదకు తెచ్చింది. బర్దీపూర్‌కి చెందిన షేక్ మతిన్ కుటుంబంలో గతకొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆదివారం అర్ధరాత్రి అన్నదమ్ముల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఇరువురూ ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో క్షణికావేశానికి గురైన తమ్ముడు ఫాయాజ్... కత్తితో అన్న మతిన్‌ గొంతు కోశాడు. తీవ్ర గాయాలపాలైన మతిన్​ను.. హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గతకొన్ని రోజుల నుంచి ఈ అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. చినికి చినికి గాలివానలా తయారై గొడవ కాస్త ప్రాణాల మీదికి తెచ్చిందని వెల్లడించారు. మతిన్​కు ఆస్పత్రిలో చికిత్స జరుగుతోందని కుటుంబసభ్యులు వెల్లడించారు. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని ఎస్సై ఆంజనేయులు సోమవారం ఉదయం తెలిపారు.

ఇదీ చదవండి: suicide attempt: కులం పేరుతో దూషణ.. యువకుడి ఆత్మహత్యాయత్నం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.