ETV Bharat / crime

ఖమ్మం నగరంలో మాదకద్రవ్యాల కలకలం

author img

By

Published : Jun 23, 2022, 4:38 PM IST

Drugs in Khammam: మాదక ద్రవ్యాల సరఫరా, వినియోగం నియంత్రణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. డ్రగ్స్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. కానీ డ్రగ్స్‌ వినియోగం మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు ఈ డ్రగ్స్ హైదరాబాద్‌ను దాటి... ఖమ్మం నగరం దాకా పాకింది.

drugs
drugs

ఖమ్మం నగరంలో మాదకద్రవ్యాలు కలకలం రేపాయి. ఖమ్మం నగరానికి చెందిన యువకుల నుంచి 30 గ్రాముల డ్రగ్స్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాద్‌లో విక్రయించేందుకు తీసుకొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. పట్టుబడిన యువకుల్లో ఒకరిపై బెంగళూరు, హైదరాబాద్‌లో కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పట్టుబడిన యువకుల నుంచి డ్రగ్స్‌తో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.