ETV Bharat / crime

Heroin Seized: శంషాబాద్​లో రూ.21 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

శంషాబాద్​ విమానాశ్రయంలో మత్తుపదార్థాల రవాణా ఆగడం లేదు. నిఘా సంస్థల కళ్లుగప్పేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు కానీ... అధికారుల నుంచి మాత్రం తప్పించుకోలేక పట్టుబడుతున్నారు. తాజాగా విమాశ్రయంలో ఓ మహిళ నుంచి 3.2 కిలోల హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు.

Heroin Seize
మహిళ నుంచి 3.2 కిలోల హెరాయిన్ స్వాధీనం
author img

By

Published : Jul 19, 2021, 10:31 PM IST

మాదకద్రవ్యాల ముఠాలు విచ్చలవిడిగా చెలరేగుతున్నాయి. రోజుకో రీతిలో వాళ్ల ఆగడాలు వెలుగులోకి వస్తున్నాయి. నగరాలు, రాష్ట్రాల సరిహద్దులు దాటి విస్తరించిన వారి నెట్‌వర్క్ విస్తుబోయేలా చేస్తోంది. డబ్బు సంపాదన కోసం విచక్షణారహితంగా మత్తు వల విసురుతున్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టులో కస్టమ్స్‌, సీఐఎస్‌ఎఫ్‌, డీఆర్‌ఐలకు చెందిన కేంద్ర విభాగాలకు చెందిన అధికారులు నిఘా పెడతారు. అయినప్పటికీ కొందరు బంగారం, మత్తు పదార్థలను తరలిస్తూ పట్టుబడుతున్నారు. తాజాగా జాంబియాకు చెందిన ప్రయాణికురాలి నుంచి డీఆర్​ఐ అధికారులు హెరాయిన్​ స్వాధీనం చేసుకున్నారు.

Heroin Seized
Heroin Seized

జాంబియా నుంచి జొహెన్నెస్ బర్గ్, దోహా మీదుగా వెళ్తున్న మహిళ ఖతర్ ఎయిర్ వేస్​లో హైదరాబాద్ చేరుకుంది. మహిళ బ్యాగును అధికారులు తనిఖీ చేయగా... అనుమానాస్పదంగా ఉన్న పౌడర్​ లభించింది. దానిని స్వాధీనం చేసుకుని... పరీక్షించగా హెరాయిన్​గా తేలింది. మొత్తం 3.2 కిలోల హెరాయిన్​ ఉన్నట్లు గుర్తించి హెరాయిన్​ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్లో సుమారు 21 కోట్ల రూపాయలు ఉంటుందని తెలిపారు. నిందితురాలని అరెస్ట్ చేశారు. మహిళ నుంచి మరింత సమాచారం సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు.

'రూ. 2,786 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత'

మహిళకు హెరాయిన్ ఇచ్చిందెవరు?. ఎక్కడ అందించాలని సూచించారనే విషయాలను తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. రెండు నెలల క్రితం శంషాబాద్​ విమానాశ్రయంలో భారీగా మత్తు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో కూడా జాంబియాకు చెందిన వాళ్లనే డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు.

Heroin Seized
Heroin Seized

ఇదీ చూడండి:

Rape: మనుమరాలిపై తాత అత్యాచారం కేసు.. వైద్య పరీక్షల్లో ఏం తేలిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.