తెదేపా విశాఖ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మాజీ ఎమ్మెల్యేగా ఉండి ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున దోచుకున్నారని, కబ్జా చేశారని నిర్ధరణ అయిన తరవాత ప్రస్తుతం ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటున్నట్టు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు పెద్ద భూకుంభకోణానికి నాంది పలికారన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూడా ఆయననే అనుసరిస్తున్నారన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చి రెండేళ్లు గడిచినా.. పార్టీలోని నేతలు ఎటువంటి భూకబ్జాలకు పాల్పడలేదని పేర్కొన్నారు. తెదేపా నేతలు తప్పుచేసి ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.
పల్లా శ్రీనివాసరావు అధికారాన్ని అడ్డంపెట్టుకుని అనేక అక్రమ ఆస్తులు కూడబెట్టారని పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజా విమర్శించారు. స్వయంగా తెదేపా విశాఖ నాయకుడే ఈ పని చేస్తే.. ఆ పార్టీ సీనియర్ నాయకులు ఏం మాట్లాడతారని అన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న ఎవ్వరినీ వదిలిపెట్టబోమన్నారు.
ఇవీ చదవండి: