Rape on Girl : విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట గ్రామానికి చెందిన పదకొండేళ్ల బాలిక...గురువారం ఎప్పటిలాగే గ్రామ సమీపంలో పుల్లలు ఏరుకునేందుకు వెళ్లింది. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించాడు అక్కడే ఉన్న అదే గ్రామానికి చెందిన 20ఏళ్ల యువకుడు. చుట్టుపక్కల ఎవరూ లేరని గుర్తించి బాలిక నోట్లో గుడ్డలు కుక్కి ఆపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఏడుస్తున్న బాలికను జరిగిన విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించి వదిలిపెట్టాడు.భయపడుతూ ఇంటికి చేరుకున్న బాలిక రాత్రి ఇంట్లో వారికి విషయం వివరించింది. ఆమె కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం నక్కపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు పార్టీల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: Tourist Bus Accident : ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బస్సు.. 9మందికి తీవ్ర గాయాలు..
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!