కార్మిక రంగ విధివిధానాలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైకాపా ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ రెడ్డి ఆరోపించారు. విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోదీ సర్కారు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనవరి 8న అఖిల భారత ట్రేడ్ యూనియన్లు తలపెట్టిన జాతీయ సమ్మెకు మద్దతు ప్రకటించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను భాజపా ప్రభుత్వం హరిస్తోందని విమర్శించారు. కార్మికులంతా సంఘటితమై సమ్మెలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి:బీసీజీ నివేదికపై అధ్యయనానికి హైపవర్ కమిటీ