ETV Bharat / city

30 ఏళ్లు విశాఖలో పౌర విమానాల సేవలు నిలిపేయాలి: విజయసాయి - YCP mp vijaya sai reddy latest news

విశాఖ విమానాశ్రయంలో 30 ఏళ్ల పాటు పౌర విమానాల సేవలు నిలిపి వేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ఎంపీ విజయసాయి రెడ్డి కోరారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పౌర విమానాల రాకపోకలు మొదలైన నాటి నుంచి దీన్ని అమలు చేయాలన్నారు.

vijaya sai reddy
vijaya sai reddy
author img

By

Published : Nov 19, 2020, 10:43 PM IST

భోగాపురం అంతర్జాతీయ గ్రీన్​ ఫీల్డ్ విమానాశ్రయానికి అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీని ఎంపీ విజయసాయి రెడ్డి కోరారు. విమానాశ్రయానికి భూ అనుమతులు మంజూరు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి విజయసాయి గురువారం లేఖ రాశారు.

మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పౌర విమానాల రాకపోకలు మొదలైన నాటి నుంచి విశాఖ విమానాశ్రయంలో సివిల్ ఏవియేషన్ సేవలను 30 ఏళ్ల పాటు నిలిపి వేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటోందని వివరించారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యనిర్వాహక రాజధాని అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని లేఖలో పేర్కొన్నారు.

ఇదీ చదవండి

ఎట్టిపరిస్థితుల్లోనూ స్థానిక ఎన్నికలను అనుమతించకూడదు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.