మూడు రాజధానులకు వ్యతిరేకంగా తెదేపా శాసనసభ్యులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ.. విశాఖ తెదేపా కార్యాలయంలోకి వైకాపా నేతలు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు అడ్డుకుని సముదాయించారు. తెదేపా కార్యకర్తలు భారీగా చేరి విశాఖ పార్టీ కార్యాలయం ఎదుట రక్షణ గోడగా నిలిచారు. దాడి యత్నానికి నిరసనగా పార్టీ కార్యాలయం నుంచి రహదారి వరకు తెదేపా నేతలు కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఓ పార్టీ కార్యకర్తలు మరో పార్టీ కార్యాలయ పరిసరాలకు వచ్చి దాడులు చేయడమేంటని ప్రశ్నించారు. తెదేపా కార్యకర్తల మౌనాన్ని చేతకాని తనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. దాడికి దిగిన వైకాపా నేతలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'రాజీనామా చేశారు... తర్వాత ఏంటీ..?'