పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా పిచ్చుకల వంటి చిన్న జీవాలు అంతరించిపోకుండా రక్షించుకోవాలని జీవీఎంసీ ప్రాజెక్టు అధికారి రవి కుమార్ కోరారు. పిచ్చుకల పరిరక్షణ దినోత్సవాన్ని.. విశాఖలోని పర్యావరణ ప్రేమికులు ఘనంగా నిర్వహించారు. పర్యావరణానికి ఎంతో మేలు చేసే పిచ్చుకలు.. విపరీతమైన రేడియేషన్ ప్రభావం వల్ల అంతరించిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వాటి కోసం చిన్నపాటి గూళ్లు, నీరు ఏర్పాటు చేయడం.. ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలని పర్యావరణ ప్రేమికులు విజ్ఞప్తి చేశారు. వాటి పరిరక్షణపై ప్రత్యేకంగా రూపొందించిన లఘు చిత్రాన్ని స్థానిక కళాశాలలో ప్రదర్శించారు. ఈ చిన్న జీవి వల్ల మానవాళికి ఎంత ప్రయోజనమో వివరిస్తూ.. పిల్లల్లో అవగాహన కల్పించాలని యువతకు సందేశమిచ్చారు. వాటి పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: