Support Rally for New Districts : కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ రాష్ట్రంలో పలుచోట్ల మహిళలు మద్దతు ర్యాలీలు నిర్వహించారు. విశాఖ, తూర్పు గోదావరి, గుంటూరు,శ్రీకాకుళం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వైకాపా మహిళా కార్యకర్తలు ర్యాలీ పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేపట్టారు.
విశాఖలో...
విశాఖలో వైకాపా మహిళాకార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. వుడా పార్క్ నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి పాలాభిషేకం చేశారు.తూర్పుగోదావరి జిల్లా నుంచి కోనసీమను కొత్త జిల్లాగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మంత్రి విశ్వరూప్ ఆధ్వర్యంలో అమలాపురంలో ర్యాలీ చేపట్టారు. హైస్కూల్ సెంటర్ వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గడియార స్తంభం సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా ....
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోనూ కొత్త జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ...వైకాపా కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు మహిళలు ప్రదర్శన చేపట్టారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు.
ఇదీ చదవండి : ఎస్‌ఆర్‌లు పరిశీలించాకే బిల్లులు ప్రాసెస్ చేయగలం - ఏపీ ట్రెజరీ ఉద్యోగుల సంఘం
తూర్పుగోదావరి జిల్లా...
కోనసీమ జిల్లాగా ప్రకటించడం పట్ల సీఎంకు కృతజ్ఞతలు తెలుపుతూ పి గన్నవరంలో ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో వైకాపా ర్యాలీ చేపట్టింది. జగన్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు తో ప్రజలకు మెరుగైన పాలన ఉంటుందని ఎమ్మెల్యే చిట్టి బాబు అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ను జిల్లాగా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ ఆధ్వర్యంలో అమలాపురంలో ర్యాలీ చేపట్టారు. హైస్కూల్ సెంటర్ వద్ద దివంగత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నుంచి గడియార స్తంభం సెంటర్ వరకు ర్యాలీ చేశారు.
తెనాలి మున్సిపల్ మార్కెట్ లోని అన్నాబత్తుని సత్యనారాయణ పురం వేదిక నుంచి రణరంగ చౌక్ వరకు వైకాపా మహిళా విభాగం ర్యాలీ చేపట్టింది. వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
గుంటూరు జిల్లా...
నూతన జిల్లాల ఏర్పాటును గుంటూరు జిల్లాలోని తెనాలి వైకాపా నేతలు స్వాగతించారు. పార్టీలకు అతీతంగా కృష్ణాజిల్లాకు తెదేపా వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు పేరును నామకరణం చేయటం హర్షించదగ్గ విషయమని కొనియాడారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్లి ప్రజా నివేదిక ప్రకారం మిగిలిన జిల్లాల పేర్లు కూడా నామకరణం చేయనున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్ సయ్యద్ స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : Amul milk project in Ananthapur: అమూల్ వచ్చాక పరిస్థితులన్నీ మారాయి: సీఎం జగన్
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!