ETV Bharat / city

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

విశాఖ అక్కయ్యపాలెంలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

author img

By

Published : Apr 16, 2019, 7:50 AM IST

అనుమానాస్పద స్థితిలో యువతి ఆత్మహత్య

విశాఖలో బీటెక్​ చదువుతున్న ఒక యువతి అక్కయ్యపాలెంలోని ఓ అపార్ట్​మెంట్​లో ఉరి వేసుకుని మృతి చెందింది. మల్కాపురం ప్రాంతం ప్రకాష్​ నగర్​కి చెందిన యువతిగా పోలీసులు గుర్తించారు. లెక్చరర్​ కిష్లే గదిలో యువతి మరణించింది. విధులు ముగించుకుని అపార్ట్​మెంట్​కు వచ్చిన కిష్లే తలుపులకు గడి వేసి ఉండటంతో విరగ్గొట్టి చూసేసరికి ఆమె ఉరి వేసుకుని మృతి చెందింది . లెక్చరర్​ పోలీసు స్టేషన్​కు వెళ్లి సమాచారం అందించారు. తనని ప్రేమిస్తున్నానంటూ వెంటపడేదని లెక్చరర్​ పోలీసులకు వివరణ ఇచ్చాడు. ఇదే విషయాన్ని యువతి తల్లిదండ్రులకు గతంలో సమాచారమిచ్చినట్లు పోలీసులకు తెలిపారు. పోలీసులు చుట్టు పక్కల వారిని విచారించగా... యువతి అప్పుడప్పుడు అపార్ట్​మెంట్​కు వచ్చి వెళ్లేదని వాచ్​మెన్​ తెలిపారు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. యువతి మృత దేహం పోస్టుమార్టానికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతి పట్ల ఉన్న అనుమానాలు బయటపడతాయని పోలీసులు తెలిపారు.

Intro:Ap_Vsp_96_07_Collector_On_Election_Arrangements_Ab_C14
కంట్రిబ్యూటర్: కె.కిరణ్
సెంటర్: విశాఖ సిటీ
8008013325
( ) విశాఖ జిల్లాలో ఎన్నికలకు సంబంధించి దాదాపు అన్ని పూర్తి చేస్తున్నామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కాటంనేని భాస్కర్ తెలిపారు.

Body:విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 11వ తేదీన విశాఖ జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నామని తెలిపారు. అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తామని ఆ సమయానికి లైన్ లో ఉండే వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు.

Conclusion:విశాఖ జిల్లా మొత్తం 34 మంది ఎంపీ అభ్యర్థులు 176 మంది అసెంబ్లీ అభ్యర్థులు బరిలో ఉన్నారని తెలిపారు 35 లక్షల 78వేల 455 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు ఓట్ల లెక్కింపు ప్రక్రియ విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయం లోని ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహిస్తామని తెలిపారు జిల్లాలో ఇప్పటి వరకు 65 శాతం ఓటర్ల స్లిప్పులు పంపిణీ జరిగిందని అందులకు ప్రత్యేకంగా బ్రెయిలీలో రూపొందించిన స్లిప్పులు అందజేశామని తెలిపారు. ఈ సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ మహేష్ చంద్ర లాడ్డా మరియు జిల్లా ఎస్పీ అట్టాడ బాబుజీ పాల్గొన్నారు.

బైట్: కాటంనేని భాస్కర్, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.