రాష్ట్రంలో ఆగ్నేయ, దక్షిణ గాలులు తక్కువ ఎత్తులో వీస్తున్నాయి. ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాంలోని కొన్ని చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రలో ఈరోజు, రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఎల్లుండి ఒకటి లేదా రెండు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని అంచనా వేసింది.
ఇదీ చదవండి: మహారాష్ట్రలో మరో 51వేల కరోనా కేసులు
రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఒకటి, రెండు చోట్ల రేపు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురవవచ్చని హెచ్చరించింది. ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి జల్లులు పడవచ్చని తెలిపింది.
ఇదీ చదవండి: