లాక్డౌన్ కారణంగా రిటైల్ వ్యాపార రంగం... ప్రత్యేకంగా వస్త్ర వ్యాపారం పూర్తిగా కుదేలైంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు కోరుతున్నారు. బంగారం, వస్త్ర వ్యాపార మాల్స్‌కు పన్నుల నుంచి 6 నెలలు మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే కొన్ని షరతులు, నిబంధనలతో పరిమితంగా అమ్మకాలకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వేల మంది కార్మికులు తమను నమ్ముకుని ఉన్నారని వాళ్లను ఆదుకోవడం తమ బాధ్యత అని చెబుతున్నారు. కొన్ని షరతులతో వ్యాపారానికి అనుమతివ్వాలంటున్న వస్త్ర పరిశ్రమ ప్రతినిధులు మావూరి వెంకటరమణ, కంకటాల మల్లిక్‌లతో ముఖాముఖి...
ఇదీ చదవండి