Vizag Steel Profits: విశాఖ ఉక్కు ఆరేళ్ల తర్వాత లాభాలను నమోదు చేసుకుంది. 2021-22 ఆర్దిక సంవత్సరంలో 835 కోట్ల లాభాన్ని ఆర్జించినట్టు స్టీల్‌ప్లాంట్ సీఎండీ అతుల్‌భట్ వెల్లడించారు. బొగ్గుకొరత, అంతర్జాతీయంగా వచ్చిన సవాళ్లను అధిమించి కొత్త రికార్డులను నెలకొల్పిన సిబ్బందిని... వివిధ విభాగాల అధికారులను ఆయన అభినందించారు. ఉక్కునగరం క్లబ్‌లో ఉన్నతాధికారులు, ట్రేడ్ యూనియన్లు, సిబ్బందితో నిర్వహించిన వార్షిక సమావేశంలో పాల్గోన్న ఆయన అమ్మకాల్లో 57 శాతం వృద్దిని నమోదు చేసినట్లు తెలిపారు. 2020-21లో 17వేల978 కోట్లు, 2021-22లో 28వేల82 కోట్ల అమ్మకాలు జరిపామన్నారు.
ఉక్కు కర్మాగారం చరిత్రలోనే ఇది అత్యధికమన్నారు. ఉక్కు ఉప ఉత్పత్తులలో 44 శాతం వృద్ది, ఎగుమతుల్లో 37 శాతం వృద్ది నమోదు చేశామన్నారు. ఈ ఏడాది మార్చి నెలలో 3వేల685 కోట్ల ఉక్కు విక్రయం ద్వారా ప్లాంట్ చరిత్రలోనే రికార్డు నెలకొల్పామన్నారు. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి 6.1 మిలియన్ టన్నుల హాట్‌మెటల్ ఉత్పత్తి లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: TDP Leaders: 'భాష మార్చుకోకపోతే.. ప్రజలే పీకేసే పరిస్థితి వస్తుంది'