ETV Bharat / city

పూర్వవిద్యార్థులు... ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించారు - railway station

విశాఖలోని రైల్వేస్టేషన్​ కాలనీలో శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు పూర్వవిద్యార్థులంతా కలిసి ఆధునీకరించారు. 'మన అందరి బడి కోసం సేవా సంఘం' ను ప్రారంభించి బడికి కొత్తదనం తీసుకువచ్చారు.

పూర్వవిద్యార్థులు ఒక్కటయ్యారు... ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించారు
author img

By

Published : Jul 28, 2019, 11:20 PM IST

పూర్వవిద్యార్థులు ఒక్కటయ్యారు... ప్రభుత్వ పాఠశాలను ఆధునీకరించారు

తాము చదువుకున్న పాఠశాల శిథిలావస్థకు గురికావడాన్ని చూసి చలించిన పూర్వ విద్యార్థులు... తిరిగి ఆ విద్యాలయానికి పూర్వ వైభవం తీసుకువచ్చారు. పూర్వ విద్యార్థులంతా కలిసి కొంత డబ్బును సమకూర్చి పాఠశాల భవనాన్ని పునర్నిర్మించి తమ వంతు భాగస్వామ్యంతో కొత్త రూపును తీసుకువచ్చారు. విశాఖలోని రైల్వే స్టేషన్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల హుద్ హుద్ కారణంగా శిథిలావస్థకు చేరుకుంది. ఆ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులంతా వాట్సాప్, ఫేస్ బుక్ ద్వారా కలుసుకుని ఓ రోజు పాఠశాలను సందర్శించారు. అక్కడి పరిస్థితిని చూసి చలించిపోయారు. తిరిగి పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే లక్ష్యంగా 'మన అందరి బడి కోసం సేవా సంఘం' ను ప్రారంభించారు. సుమారు 100 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పాఠశాలను ఆధునీకరించారు. పాఠశాల భవనానికి అల్లూరి సీతారామరాజు భవనంగా నామకరణం చేశారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ (డిఆర్ఎం) చేతన్ కుమార్ శ్రీ వాస్తవ్​లచే ప్రారంభోత్సవం చేయించారు. చదువుకున్న పాఠశాలకు మేలు చేయాలనే ఆలోచన చాలా గొప్పవిషయమని అతిథులు అభినందించారు. ఇటువంటి కార్యక్రమాలు నేటితరం విద్యార్థులకు స్ఫూర్తిని నింపుతుందని పూర్వవిద్యార్థలను కొనియాడారు.

ఇదీ చదవండి:

విశాఖలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం

Intro:ప్రభుత్వ ఆసుపత్రిలో ఆట వస్తువులు తుప్పు పట్టి పాడై పోతున్నాయి పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో నాలుగేళ్ల క్రితం దాతల సహకారంతో ఆసుపత్రి ప్రాంగణంలో ఆట వస్తువులు ఏర్పాటు చేశారు ఇక్కడికి వైద్యం కోసం వచ్చే వారి పిల్లలు ఆడుకునేందుకు వీటిని అందంగా తీర్చిదిద్దారు అయితే ఆసుపత్రి అభివృద్ధి కమిటీ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఇవి ఇలా తుప్పుపట్టి పాడై నిరుపయోగంగా మారాయి ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిని వినియోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు

Body:నోబుల్ ఆకివీడు

Conclusion:నోబుల్

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.