ETV Bharat / city

విశాఖలో గ్యాస్‌ లీక్‌ : ఈ జాగ్రత్తలు తీసుకోండి! - Vizag LG Polymers Gas Leak

విశాఖపట్నంలో ఎల్‌జీ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన ఘటనలో చాలా మంది అనారోగ్యం బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Vizag LG Polymers Gas Leak
విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు
author img

By

Published : May 7, 2020, 12:48 PM IST

Vizag LG Polymers Gas Leak
విశాఖ ఎల్జీ పాలిమర్స్ వార్తలు

విశాఖపట్నంలో ఎల్‌జీ పరిశ్రమ నుంచి గ్యాస్ లీకైన కారణంగా వందల మంది అనారోగ్యానికి గురయ్యారు. ఈ గ్యాస్‌ పీల్చిన వెంటనే మెదడుపై ప్రభావం చూసిస్తుందని.. అందుకే ఇది ప్రమాదకరమని నిపుణులు వెల్లడించారు. ప్రమాద స్థలానికి సమీప ప్రాంతాల్లోని ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇందుకు సంబంధించి వైజాగ్‌ కొవిడ్-19 వాలంటీర్స్‌.. కొన్ని ప్రాథమిక సూచనలు చేశారు.

* నీటిని అధికంగా తీసుకోవాలి.

* తప్పనిసరిగా తడి మాస్కు ధరించాలి. ఇంటిదగ్గర ఉన్నా సరే మాస్కు వేసుకోవాలి.

* కళ్లు మంటగా అనిపిస్తే వెంటనే కంటి చుక్కలు వేసుకోవాలి.

* ఇబ్బందిగా అనిపిస్తే సిట్రిజన్‌ మందును వాడాలి (డాక్టరు సలహా మేరకు మాత్రమే).

* వాంతులు అయితే డామ్‌స్టాల్‌ ట్యాబ్లెట్‌ వేసుకోవచ్చు .

* గ్యాస్‌ ప్రభావాన్ని తటస్థీకరించేందుకు పాలు, అరటిపండ్లు, బెల్లం తీసుకోవాలి.

* మరో 48 గంటలపాటు బయటకు వెళ్లకుండా ఇంటికే పరిమితం కావాలి.

* అత్యవసర పరిస్థితి ఉంటే వెంటనే 108కి కాల్‌ చేయాలి.

ఇవీ చదవండి:

విశాఖలో గ్యాస్ లీక్... ఏరియల్​ వ్యూ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.