ETV Bharat / city

20 లక్షల దారి దోపిడీ కేసులో బాధితుడే నిందితుడు! - పోలీసులు

గాజువాక పోర్టు రోడ్డులో ఈ నెల 7న భారీ చోరీ జరిగింది. బ్యాంకులో డబ్బు జమ చేసేందుకు వెళ్తోన్న ఓ వ్యక్తిని దుండగులు అడ్డగించి నగదుతో ఉడాయించారు. ఈ కేసును పోలీసులు ఛేదించారు. బాధితుడే నిందితుడని తెలిసి అవాక్కాయ్యారు.

vishaka_port_robbery_case_solved
author img

By

Published : Aug 10, 2019, 12:46 PM IST

Updated : Aug 10, 2019, 12:51 PM IST

20 లక్షల దారి దోపిడీ కేసులో బాధితుడే నిందితుడు!

విశాఖ పోర్టు రోడ్డులో దారి దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. దోపిడీ జరిగిందని బాధితుడు శ్రీనివాస్​ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.20 లక్షలు అపహరించారనే పోలీసులు కేసు నమోదు చేశారు. కేసును ఛేదించే పనిలో పోలీసులే అవాక్కాయ్యారు. బాధితుడు శ్రీనివాస్​ నిందితుడిగా గుర్తించారు. ప్రైవేటు ట్రాన్స్​ పోర్టు కంపెనీలో శ్రీనివాస్ పని చేస్తున్నాడు. సంస్థకు చెందిన రూ.20 లక్షలు కాజేయాలని ప్లాన్ వేశాడు. స్వయంగా బ్లేడుతో గాయపరుచుకుని ఎవరో..దోపిడీ చేసినట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. పొంతనలోని సమాధానాలు చెప్పడంతో అనుమాన పడిన పోలీసులు అసలు విషయం రాబట్టారు. నిందితుడు శ్రీనివాస్ నుంచి రూ.20 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ ఆర్​.కె.మీనా తెలిపారు.

సంబంధిత వార్త: విశాఖ పోర్టు రోడ్డులో దారి దోపిడీ..20 లక్షలు అపహరణ

Last Updated : Aug 10, 2019, 12:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.