దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ శివారులో యువతి అత్యాచారం, హత్యకేసు రాష్ట్ర పోలీసు శాఖలో చలనం కలిగించింది. ఇంతవరకు మహిళా భద్రత, రక్షణకు సంబంధించి ఆశ్రయించాల్సిన నంబర్లు, సాంకేతికత వినియోగం వంటి అంశాలపై ప్రచారానికి ఇప్పుడు మరింతగా ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పారిశ్రామిక నగరి విశాఖలో కమిషనరేట్‌లో దీనిపై విస్తృతంగా ప్రచారం కల్పించనున్నారు.
ఎవరైనా ఆపదలో ఉంటే 100, 112, 1090 నంబర్లకు ఫోన్ చేయవచ్చు. ప్రమాదంలో ఉన్నప్పుడు 108 నంబర్‌కు కూడా ఫోన్ చేయవచ్చు. పికెట్స్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. రాత్రి వేళ పహారా కాసే బృందాలను పెంచుతున్నాం. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు కూడా కనీస జాగ్రత్తలు పాటించండి. త్వరలోనే వర్చువల్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయబోతున్నాం. దీనివల్ల పోలీస్ స్టేషన్‌కు రాకుండానే బాధితులు ఫిర్యాదులు ఇవ్వవచ్చు.
- ఆర్కే మీనా, విశాఖ పోలీసు కమిషనర్
ఎక్కడి నుంచి ఫిర్యాదు..?
నిస్సహాయ స్ధితిలో ఉండే మహిళ సాయం కోసం ఆశ్రయించాల్సిన పద్ధతిని ప్రతి ఒక్కరి దృష్టిలో పడే విధంగా వీటిని సిద్ధం చేయనున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో వర్చువల్ పోలీసు స్టేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. దీనివల్ల పోలీసు స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేసేందుకు భయపడేవారి నుంచి ఫిర్యాదు తీసుకొని... సంబంధిత పోలీసు స్టేషన్‌కి దీనిని పంపి చర్యలు తీసుకునేలా చూస్తారు. నేరుగా ఉన్నతాధికార్ల పర్యవేక్షణలోనే ఇవి ఉంటాయి. పరిధి చూసుకోకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు తీసుకొని వెంటనే నిర్దేశిత స్టేషన్‌కి సమాచారం ఇచ్చే విధంగా అప్రమత్తం చేయనున్నారు.
ఇదీ చదవండి