ETV Bharat / city

Vizag Drugs Case: ఆయనిచ్చిన సమాచారం ‘మత్తు’ వదిలించేనా? - మాదకద్రవ్యాల అక్రమ రవాణపై కథనం

hyderabad drugs case: మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంలో తరచూ విశాఖ పేరు వినిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో పోలీసులు మాదకద్రవ్యాల వ్యాపారి నరేంద్ర ఆర్యను అరెస్టు చేశారు. విచారణలో విశాఖలోని కొందరితో ఆయనకు పరిచయాలు ఉన్నట్లు తేలింది. వారెవరన్న అంశంపై హైదరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతో స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. మాదక ద్రవ్యాల వ్యాపారితో పరిచయాలు ఉన్న వారంటే కచ్చితంగా వారు విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర మొత్తం వ్యాపారం/సరఫరా చేస్తున్న వారే అయి ఉంటారని పోలీసుల అంచనా. డీలర్లు సహజంగా అత్యంత నమ్మకస్తులకు మాత్రమే సరకును విక్రయిస్తుంటారు. విశాఖలో ఎల్‌ఎస్‌డీ (లైసర్జిక్‌ యాసిడ్‌ డై ఇథైలమైడ్‌), ఎండీఎంఏ (మిథిలీన్‌ డైఆక్సీ మిథైలాంఫెటమైన్‌) తదితర మత్తు పదార్థాలను విక్రయిస్తూ పట్టుబడుతున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి.

Drugs Case
మాదకద్రవ్యాల అక్రమ రవాణా
author img

By

Published : Sep 13, 2022, 10:00 AM IST

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగంలో తరచూ విశాఖ పేరు వినిపిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా హైదరాబాద్‌లో పోలీసులు మాదకద్రవ్యాల వ్యాపారి నరేంద్ర ఆర్యను అరెస్టు చేశారు. విచారణలో విశాఖలోని కొందరితో ఆయనకు పరిచయాలు ఉన్నట్లు తేలింది. వారెవరన్న అంశంపై హైదరాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాంతో స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. మాదక ద్రవ్యాల వ్యాపారితో పరిచయాలు ఉన్న వారంటే కచ్చితంగా వారు విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర మొత్తం వ్యాపారం/సరఫరా చేస్తున్న వారే అయి ఉంటారని పోలీసుల అంచనా. డీలర్లు సహజంగా అత్యంత నమ్మకస్తులకు మాత్రమే సరకును విక్రయిస్తుంటారు. విశాఖలో ఎల్‌ఎస్‌డీ (లైసర్జిక్‌ యాసిడ్‌ డై ఇథైలమైడ్‌), ఎండీఎంఏ (మిథిలీన్‌ డైఆక్సీ మిథైలాంఫెటమైన్‌) తదితర మత్తు పదార్థాలను విక్రయిస్తూ పట్టుబడుతున్న ఉదంతాలు తరచూ వెలుగు చూస్తున్నాయి. ‘సింథటిక్‌ డ్రగ్స్‌’గా పేర్కొనే వీటితో ఇటీవలి కాలంలో నగరం, నగర శివార్లలో రేవ్‌ పార్టీలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోందనే అనుమానాలు ఉన్నాయి.

అందుబాటులో అన్ని రకాలు

నగరంలో అన్ని రకాల మాదక ద్రవ్యాలు దొరుకుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గంజా, చరస్‌, కొకైన్‌, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌, ఎండీఎంఏ, ఎండీఎంఏ పిల్స్‌, క్రిస్టల్‌ మెథ్‌, బ్రౌన్‌షుగర్‌, ద్రవరూప గంజాయి, గంజాయి చాక్లెట్లు తదితరాలన్నీ లభిస్తున్నాయి. వీటిని గోవా, బెంగళూరు, ముంబయి, హైదరాబాద్‌ల నుంచి ఆయా మాదకద్రవ్యాలను కొరియర్లలో తెప్పించుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రాం ఉపయోగించి కొందరు డీలర్లు విక్రయాలు చేస్తున్నారు. వీటి ధరలు రూ.4 వేల నుంచి రూ.5 వేలకు ఉంటున్నట్లు తెలిసింది. గంజాయి మాత్రం విశాఖలోనే అతితక్కువ ధరకు లభిస్తోంది. కొందరు వైద్యపరంగా ఉపయోగించే మత్తుమందులను సైతం వైద్యుల సిఫార్సు లేఖలు లేకుండానే అక్రమ మార్గాల్లో కొనుగోలు చేస్తున్నారు.

యాంటీ నార్కోటిక్‌ సెల్‌ ఏర్పాటు: నగరంలో మత్తుపదార్థాల అక్రమ రవాణాను అరికట్టడానికి సీపీ శ్రీకాంత్‌ టాస్క్‌ఫోర్స్‌లోని కొందరు పోలీసు అధికారులతో ప్రత్యేకంగా యాంటీ నార్కోటిక్‌ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఈ బృందం దృష్టి పెట్టడంతో పలువురు నిందితులు పట్టుబడుతున్నారు. సూత్రధారుల పేర్లు మాత్రం వెలుగు చూడడంలేదు. మాదక ద్రవ్యాలను తరచూ వినియోగించేవారు వాటికి బానిసలు అవుతున్నారు. అలాంటి వారి నాడీ వ్యవస్థ దెబ్బతిని తీవ్ర మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ మత్తులో కొందరు నేరాలకు పాల్పడుతున్న ఉదంతాలూ ఉంటున్నాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.